పదవీ విరమణ పొందిన తర్వాత ఉద్యోగుల రక్షణ కోసం ప్రభుత్వం కొన్ని స్కీమ్స్‌ను అమలు చేస్తోంది. ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అనేది భారతదేశంలో వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన అతిపెద్ద సామాజిక భద్రతా కార్యక్రమాలలో ఒకటి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) భారతదేశంలో ఉద్యోగుల PFని నిర్వహిస్తుంది.
ఈపీఎఫ్‌వో సేవల్లో డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అనేక సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారు/చందాదారు వ్యక్తిగతంగా కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ బ్యాలెన్స్‌ని కూడా ఇంటి వద్ద నుంచే వివిధ మార్గాల్లో చెక్ చేసుకునే సదుపాయం ఉంది. ఆన్లైన్లో PF బ్యాలెన్స్‌ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబర్లకు అందుబాటులో ఉన్న నాలుగు మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
* మిస్డ్ కాల్(Missed Call) : UAN పోర్టల్‌లో నమోదు చేసుకున్న సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా EPFO వివరాలను పొందవచ్చు. రెండు రింగ్‌ల తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా డిస్కనెక్ట్ అవుతుంది. ఈ సేవను పొందడానికి సభ్యునికి ఎటువంటి ఖర్చు ఉండదు. సబ్‌స్క్రైబర్ UAN బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్, పాన్లలో ఏదైనా ఒకదానితో లింక్ అయితే, ఈ మార్గంలో PF బ్యాలెన్స్ వివరాలను పొందవచ్చు.
* మెసేజ్(SMS) : UAN యాక్టివేట్ చేసుకున్న సబ్స్క్రైబర్లు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి SMS పంపి, EPFO అకౌంట్లో అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ గురించి తెలుసుకోవచ్చు. పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ సమాచారం కూడా తెలుస్తుంది. అందుకు 7738299899 నంబర్‌కి ‘EPFOHO UAN’ అని టైప్ చేసి పంపాలి. ఈ ఫీచర్ ఇంగ్లీష్ (డిఫాల్ట్), హిందీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ భాషల్లో అందుబాటులో ఉంది.