నిత్యజీవితంలో మనకు ఉన్నట్టుండి కొన్ని అనుకోని ఆపదలు వస్తుంటాయి. అది డబ్బులతో ముడిపడి ఉన్న సమస్య అయితే దాని నుంచి బయట పడటానికి కొన్ని మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. లోన్ తీసుకుని సమస్య పరిష్కరించడం ఇందులో ఒకటి. బయట అప్పు చేయాల్సిన పని లేకుండా ఆర్థిక అవసరాలను తీర్చుకునే సౌలభ్యం ఇన్స్టంట్ లోన్ ద్వారా కలుగుతుంది.
* ఉన్నత విద్య కోసం.. : చాలామంది విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించాలనే కోరిక ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనే కుతూహలం ఉంటుంది. కానీ అందుకు సరిపడా డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి వారు ఈ ఇన్స్టంట్ లోన్ ద్వారా తీసుకున్న రుణంతో హయ్యర్ ఎడ్యుకేషన్ కొనసాగించవచ్చు. విదేశాల్లో చదువుకుంటూనే పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ ఈఎంఐ చెల్లించొచ్చు. ఫలితంగా చదువును పూర్తి చేసి ఉన్నత ఉద్యోగంలో సెటిల్ అవ్వొచ్చు. కెరీర్ పరంగా విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగం.
* అప్పు తీర్చడానికి.. : ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి కొన్ని సార్లు అప్పు చేయాల్సి ఉంటుంది. అలా చేసిన అప్పును తీర్చడానికి ఇన్స్టంట్ లోన్ ద్వారా తీసుకున్న డబ్బు సహాయపడుతుంది. ఎవరికీ బాకీ ఉండకుండా మెలగడం చాలా ఉత్తమమైన లక్షణం. మీరు కూడా మీ బాకీలను తీర్చేసి రుణ రహిత వ్యక్తిగా మారడానికి ఈ లోన్ ఉపయోగ పడుతుంది. ఇన్స్టంట్ లోన్‌కు మిగతా వాటితో పోలిస్తే తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. దీంతో అధిక వడ్డీ రేటు ఉన్న లోన్లు/ అప్పులను ఒక్కసారిగా తీర్చేసేందుకు ఇన్స్టంట్ లోన్ డబ్బును వినియోగించడం మేలు. రెండు మూడు చిన్నాచితకా లోన్లను కలిగి ఉండటం కన్నా ఒకటే లోన్ని మేనేజ్ చేయడం సులువు కదా. తీసుకున్న లోన్‌తో చిరు బాకీలను తీర్చేయండి.
* వైద్య ఖర్చులు : ఇన్స్టంట్ లోన్ ద్వారా సులువుగా, తక్కువ సమయంలో రుణం పొందవచ్చు. ఇలా తీసుకున్న డబ్బులను వైద్య ఖర్చుల కోసం వెచ్చించవచ్చు. ఉన్నఫలంగా మెడికల్ బిల్లు చెల్లించడానికి చేతిలో డబ్బులు లేకపోతే ఈ లోన్ ఎంతో ఉపయోగపడుతుంది. మీకు కాని, మీ కుటుంబ సభ్యులకు కాని అత్యవసర వైద్యం అందించాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు లోన్ ద్వారా తీసుకున్న డబ్బు సహాయపడుతుంది. చేతిలో డబ్బులు లేక పెండింగులో ఉంచిన మెడికల్ బిల్లులను సైతం చెల్లించవచ్చు.
* పెళ్లి ఖర్చులు : మన దేశంలో వివాహం అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. టెంట్‌హౌజ్ సామగ్రి నుంచి డెకరేషన్లు, క్యాటరింగ్, పెట్టిపోతలు.. ఇలా ఎన్నో కార్యక్రమాలకు డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో బయట అప్పు చేయడం కన్నా సొంతంగా లోన్ తీసుకోవడం మేలు. ఇన్స్టంట్ లోన్ ద్వారా అవసరమైన మొత్తాన్ని పొంది ఆ డబ్బును ఖర్చు చేయొచ్చు.