ఆటో మొబైల్ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో లేటెస్ట్ బైక్‌లను మార్కెట్లోకి లాంచ్ చేస్తుంటాయి. అయితే కొన్ని మాత్రమే బాగా పాపులర్ అవుతాయి. ఎక్కువ శాతం మంది బైక్ లుక్ కంటే మైలేజీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రధానంగా స్టైలిష్ లుక్‌ను కోరుకునే వారు తక్కువగా ఉంటారు. ఇండియాలో ఎక్కువ మైలేజీని ఇస్తూ.. మంచి ఫీచర్లు అందిస్తున్న బైక్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ మైలేజీ అందించే స్కూటర్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
* హోండా యాక్టివా 6G : భారత్‌లో బాగా పాపులర్ అయిన స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. ఇది స్టాండర్డ్ ట్రిమ్, DLX, ప్రీమియం ఎడిషన్ వంటి మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ వేరియంట్ల ధరలు రూ. రూ.73,086 నుంచి రూ.76,587 మధ్య ఉన్నాయి. ప్రస్తుత BS6-కంప్లైంట్ Activa 6G, 109.51cc, సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇది 7.79PS గరిష్ట శక్తితో పాటు 8.84Nm పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటీ 60 kmpl మైలేజీ అందిస్తుంది.
* సుజుకి యాక్సెస్ 125 : జపాన్ బైక్ మేకర్ సుజికి చెందిన యాక్సెస్ 125 స్కూటీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్, స్పెషల్ ఎడిషన్, రైడ్ కనెక్టెడ్ ఎడిషన్ వంటి వేరియంట్లలో అందుబాటులో ఉంది. సుజుకి యాక్సెస్ 125 స్కూటీలో 124సీసీ ఫ్యూయెల్ -ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 64 kmpl మైలేజ్ అందిస్తుంది. ఈ స్కూటీలో 5-లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది. దీంతో ట్యాంక్ రేంజ్ 300 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. సుజుకి యాక్సెస్ 125 ధర రూ. 77,600 నుంచి రూ.87,200 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
* యమహా రేజర్ 125 : యమహా కంపెనీకి చెందిన యమహా రేజర్ 125 బైక్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. డ్రమ్, డిస్క్, DLX, MotoGP, స్ట్రీట్ ర్యాలీ ఎడిషన్లలో అందుబాటులో ఉంటుంది. డిజైన్ పరంగా యమహా ఫాసినో 125cc మైల్డ్-హైబ్రిడ్ స్కూటర్ మాదిరిగా ఉంటుంది. ఈ స్పోర్టియర్ RayZR సుమారుగా 66 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ స్కూటీ ధరలు రూ.80,730 నుంచి రూ. 90,130(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటాయి.
* యమహా ఫాసినో హైబ్రిడ్ 125 : యమహా కంపెనీకి చెందిన ఈ స్కూటర్ మంచి స్టైలిష్ లుక్ ఇస్తుంది. కొత్త ఫాసినో 125 రెండు వేరియంట్లలో లభిస్తుంది. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ప్రారంభ ధర రూ.76,600(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఎస్పీఎల్ డిస్క్ వేరియంట్ ధర రూ.87,830(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. మైల్డ్-హైబ్రిడ్ డిజైన్‌తో ఇండియాలో మోస్ట్ ఫ్యూయల్ ఎఫిసియట్ 125సీసీ స్కూటీగా యమహా ఫాసినో హైబ్రిడ్ ప్రసిద్ధి పొందింది. ఈ స్కూటీ మైలేజీ 68.75 kmplగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటీలో 125cc ఎయిర్-కూల్డ్ ఇంజన్ (8.2PS/10.3Nm) ఉంటుంది. ఇది స్మార్ట్ మోటార్ జెనరేటర్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ట్రాఫిక్‌లో స్మూత్‌గా వెళ్లడానికి సహాయపడే టార్క్ అసిస్ట్ సిస్టమ్‌గా ఇది పనిచేస్తుంది.