ఆర్బీఐ రెపో రేటు పెంపు నేపథ్యంలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వరుసపెట్టి రుణ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. దీని వల్ల రుణ గ్రహీతలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇప్పటికే ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, పీఎన్బీ వంటి పలు బ్యాంకులు రుణ రేట్లను పెంచేశాయి. దీంతో లోన్ తీసుకున్న వారి నెల వారీ ఈఎంఐ పైకి కదులుతున్నాయి.