1. చాలా మంది క్రెడిట్ కార్డ్‌ల ద్వారా అందే ప్రయోజనాల కోసం వాటిని వినియోగిస్తుంటారు. ప్రతి ట్రాన్సాక్షన్‌పై రివార్డ్ పాయింట్స్ అందుకుంటారు. వాటిని ఆ తర్వాత ఇతరత్రా ప్లాట్‌ఫారమ్‌లలో పేమెంట్స్‌కి ఉపయోగిస్తారు. అయితే ఇప్పుడు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌లు ఉపయోగిస్తున్న వారికి బ్యాంక్ షాక్ ఇచ్చింది. రివార్డ్ పాయింట్ ప్రోగ్రామ్‌ను రివైజ్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అంతేకాకుండా సెలక్టెడ్ నంబర్ రివార్డ్ పాయింట్స్‌పై ఫీజు స్ట్రక్చర్ కూడా మార్చింది. అయితే ఈ మార్పులు 2023 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అన్ని కార్డ్‌లను ఫ్లైట్ అండ్ హోటల్ రిజర్వేషన్స్, తనిష్క్ వోచర్స్, నిర్దిష్ట ప్రొడక్ట్- వోచర్స్‌కు సంబంధించి పేమెంట్ చేసే సందర్భంలో రెడిమ్ చేసే అవకాశం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. HDFC బ్యాంక్ SmartBuy పోర్టల్ ద్వారా విమానాలు & హోటల్ బుకింగ్స్ చేస్తే కాలెండర్ మంత్‌లో రివార్డ్ పాయింట్స్ ఇలా ఉండనున్నాయి.. Infinia కోసం 1,50,000 రివార్డ్ పాయింట్స్, డైనర్స్ బ్లాక్ కోసం 75,000 రివార్డ్ పాయింట్స్, ఇతర కార్డ్‌లకు 50,000 రివార్డ్ పాయింట్స్‌ను రెడిమ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. HDFC బ్యాంక్ SmartBuy పోర్టల్‌లో తనిష్క్ వోచర్స్పై Infinia కార్డుదారులు ఒక క్యాలెండర్ మంత్‌లో కేవలం 50,000 రివార్డ్ పాయింట్స్‌ను మాత్రమే ఇకపై రెడిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్ రెగాలియా, బిజినెస్ రెగాలియా ఫస్ట్, బిజినెస్ మనీ బ్యాక్, CSC స్మాల్ బిజినెస్ మనీబ్యాక్, Paytm బిజినెస్, ఫ్లిప్‌కార్ట్ బిజినెస్, రిటైలియో, బెస్ట్ ప్రైస్ సేవ్ స్మార్ట్, బెస్ట్ ప్రైస్ సేవ్ మాక్స్, పైన్‌లాబ్స్ వంటి వాటి కార్డుల ద్వారా ఎడ్యుకేషన్ సంబంధ లావాదేవీలు జరిపితే ఇకపై రివార్డ్ పాయింట్స్ పొందలేరు. (ప్రతీకాత్మక చిత్రం)
5. స్టేట్మెంట్ బ్యాలెన్స్ (క్యాష్‌బ్యాక్ రెడెంప్షన్)కు సంబంధించి రివార్డ్ పాయింట్స్ రెడెంప్షన్లో భాగంగా మిలీనియా, ఈజీ Emi మిలీనియా, భారత్, ఫార్మసీ అండ్ Paytm కార్డ్స్‌పై క్యాలెండర్ మంత్‌కు 3000 రివార్డ్ పాయింట్స్ పొందవచ్చు. ఇతర అన్ని కార్డ్‌లకు 50,000 రివార్డ్ పాయింట్లకు పరిమితం చేసింది. అయితే ఇది 2023 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ & వోచర్స్ సంబంధించి.. రివార్డ్ పాయింట్స్ రెడెంప్షన్ అనేది మొత్తం విలువలో 70 శాతానికి పరిమితం చేసింది. మిగిలిన మొత్తాన్ని అదే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి 2023 ఫిబ్రవరి 1న చెల్లించాలి. ఇది Infina & Diners బ్లాక్ కార్డ్‌లకు వర్తించదు. రెంట్ పేమెంట్స్‌కు సంబంధించి ఇకపై అన్ని కార్డ్‌లపై రివార్డ్ పాయింట్స్ పొందలేరు. బిజినెస్ రెగాలియా, బిజినెస్ రెగాలియా ఫస్ట్, బిజినెస్ మనీ బ్యాక్, CSC స్మాల్ బిజినెస్ మనీబ్యాక్, Paytm బిజినెస్, Flipkart Business, Retailio, బెస్ట్ ప్రైస్ సేవ్ స్మార్ట్, బెస్ట్ ప్రైస్ సేవ్ మ్యాక్స్, Pinelabs మినహా మిగతా అన్ని కార్డులపై ప్రభుత్వ సంబంధిత లావాదేవీలు చేస్తే రివార్డ్స్ ఇక రావు. (ప్రతీకాత్మక చిత్రం)
7. విదేశాల్లో ఉండి భారతీయ కరెన్సీలో లావాదేవీ జరిపినప్పుడు లేదా భారతదేశంలో ఉండి, విదేశాల్లో రిజిస్టర్ చేసుకున్న వ్యాపారితో లావాదేవీని (స్టోర్‌లో లేదా ఆన్లైన్లో) నిర్వహిస్తే, డైనమిక్ & స్టాటిక్ కన్వర్షన్ మార్కప్ రుసుముగా 1% ఛార్జ్ చేయనున్నారు. థర్డ్-పార్టీ వ్యాపారుల ద్వారా చేసే రెంట్ పేమెంట్స్ కోసం, క్యాలెండర్ నెలలోని రెండో రెంటల్ లావాదేవీ నుంచి మొత్తం లావాదేవీ మొత్తంలో 1% ఫీజుగా వసూలు చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)