కరోనా తర్వాత పరిస్థితులు అదుపులోకి రావడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు వడ్డీ రేట్లపై దృష్టి సారించాయి. చాలా బ్యాంకులు ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్(FD-Fixed Deposit) ప్లాన్స్‌పై అందిస్తున్న వడ్డీ రేట్ల(Interest Rates)ను పెంచాయి. ఇది రిస్క్ లేని పెట్టుబడులు చేయాలనుకొంటున్న వారికి శుభవార్త. చాలా సంవత్సరాలుగా అందుతున్న తక్కువ వడ్డీ రేట్లు ఇకపై మారనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
చాలా సంవత్సరాలుగా పోస్ట్ ఆఫీసులు స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై అందిస్తున్న వడ్డీ రేట్లను మార్చలేదు. స్థిరంగా పోస్ట్ ఆఫీసులు వడ్డీరేట్లను ఉంచడంతో బ్యాంకుల్లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్ ప్లాన్స్ కంటే ఎక్కువ వడ్డీని వినియోగదారులు అందుకొన్నారు. ప్రస్తుతం ఎస్బీఐ, HDFC బ్యాంక్, పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. (ప్రతీకాత్మక చిత్రం)
ఏడాది కాలానికి చేసిన ఫిక్స్డ్ డిపాజిట్స్‌పై 10 బేసిస్ పాయింట్లను HDFC బ్యాంక్ పెంచింది. ఏడాది కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్స్‌కు గతంలో 4.9 శాతం వడ్డీ లభిస్తుండగా ఇప్పుడు వినియోగదారులు 5 శాతం వడ్డీని అందుకోగలరు. అదే విధంగా 3 నుంచి 5 ఏళ్ల ఎఫ్డీలపై వడ్డీని 5 బేసిస్ పాయింట్లు పెంచి 5.45 శాతానికి పరిమితం చేసింది. ఈ వడ్డీ రేటు గతంలో 5.40 శాతంగా ఉండేది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా, 1961లో 80C సెక్షన్ ప్రకారం పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్స్‌ను ఐదేళ్ల కాలానికి చేస్తే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో రెగ్యులర్ కస్టమర్లు పోస్టాఫీస్‌లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్స్‌పై లభించే వడ్డీ రూ.40,000 దాటితే వడ్డీని పోస్టాఫీసులు మినహాయించుకొంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)