రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కీలక వడ్డీరేట్లను సవరించిన విషయం తెలిసిందే. దీంతో ఇండియన్ కమర్షియల్ బ్యాంకులు లోన్లతో పాటు డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీని పెంచగా, తాజాగా ప్రముఖ ప్రైవేట్ రంగ రుణదాత HDFC బ్యాంక్ కూడా ఈ జాబితాలో చేసింది.
రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఈ బ్యాంకు పెంచింది. కొత్త రేట్లు నవంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చాయి. HDFC బ్యాంక్ ఇప్పుడు వివిధ మెచూరిటీ గడువులతో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 15 నెలల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై ఈ సంస్థ తాజాగా వడ్డీని 35 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. (ప్రతీకాత్మక చిత్రం)
30- 45 రోజులకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4 శాతం; 46- 60 రోజుల ఎఫ్డీపై సాధారణ ప్రజలకు 4 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం; 61- 89 రోజుల డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5 శాతం; 90 రోజుల నుంచి 6 నెలల కంటే తక్కువ గడువుకు చేసే డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5 శాతం వడ్డీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
* ఈ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ
6 నెలల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ గడువుతో చేసే ఎఫ్డీలపై హెచ్డీఎఫ్సీ బ్యాంకు సాధారణ ప్రజలకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది. అలాగే ఒక సంవత్సరం నుంచి 18 నెలల కంటే తక్కువ ఎఫ్డీలపై సాధారణ ప్రజలకు 6.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.90 శాతం; 18 నెలల నుంచి 21 నెలల కంటే తక్కువ ఎఫ్డీలపై సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీని అందిస్తోంది. 21 నెలల 1 రోజు నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ గడువుతో చేసే డిపాజిట్లపై ఈ బ్యాంకు సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీని అమలుచేస్తోంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల గడువుతో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతంగా ఉంది. 3 సంవత్సరాల 1 రోజు నుంచి ఐదేళ్ల ఎఫ్డీపై సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ ఉంటుంది. 5 సంవత్సరాల 1 రోజు నుంచి పదేళ్ల గడువుతో చేసే ఎఫ్డీపై సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం వడ్డీరేట్లు అమలవుతాయని బ్యాంకు పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
* వారికి స్పెషల్ ఆఫర్
అయితే సీనియర్ సిటిజన్లు ఐదు సంవత్సరాల ఒకరోజు నుంచి పదేళ్ల గడువుతో చేసే రూ.5 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అదనంగా మరో 0.25 శాతం వడ్డీని అందిస్తోంది. 2020, మే 18 నుంచి 2023 మార్చి 31 వరకు అందిస్తున్న స్పెషల్ డిపాజిట్ స్కీమ్‌లో భాగంగా బ్యాంకు ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ ప్రవాస భారతీయులకు వర్తించదని బ్యాంకు పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)