HDFC Loan | ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తాజాగా కస్టమర్లకు షాకిచ్చింది. వ్యక్తిగత రుణాలపై చార్జీలను సవరించింది. ఈ కొత్త చార్జీలు ఏప్రిల్ నెల 24 నుంచి అమలులోకి వస్తాయని బ్యాంక్ వెల్లడించింది. దీంతో బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం పడుతుంది. కొత్త చార్జీలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రిపేమెంట్ చార్జీల విషయానికి వస్తే.. ఏడాదిలోపు ప్రిపేమెంట్ చేయడం కుదరదు. 13 నుంచి 24 నెలలలోపు అయితే లోన్ ఔట్‌స్టాండింగ్ అమౌంట్లో 4 శాతం చెల్లించుకోవాలి. 25 నుంచి 36 నెలలలోపు అయితే ఔట్‌స్టాండింగ్ అమౌంట్‌పై 3 శాతం చార్జీ పడుతుంది. 36 నెలలకు పైన అయితే 2 శాతం చార్జీ చెల్లించుకోవాలి. ఇతర చార్జీలు అదనం.
అదే ప్రిమెచ్యూర్ క్లోజర్ (పార్షియల్ పేమెంట్) అయితే చార్జీలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. పార్ట్ పేమెంట్ అమౌంట్‌పై పార్షియల్ ప్రిమెచ్యూర్ క్లోజర్ చార్జీలు వర్తిస్తాయి. లోన్ ఔట్‌స్టాండింగ్ అమౌంట్లో 25 శాతం వరకు పార్షియల్ ప్రిమెచ్యూర్ పేమెంట్‌ను అనుమతిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి, లోన్ టెన్యూర్‌లో రెండు సార్లు ఈ సదుపాయం లభిస్తుంది.