ఈ క్రమంలోనే బ్యాంకులు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. బ్యాంకులు చాలా వరకు రుణ రేట్లు పెంచేశాయి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను కూడా పెంచాయి. కాగా ఈ రోజు ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయం వెలువడనుంది. నేడు కూడా ఆర్బీఐ పాలసీ రేటును పెంచొచ్చనే అంచనాలు ఉన్నాయి. దీని వల్ల రుణ రేట్లు, డిపాజిట్ రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల డబ్బులు దాచుకోవాలని భావించే వారు ఇంకొన్ని రోజుల ఆగడం ఉత్తమం