బ్యాంక్‌లో 48 నెలల టెన్యూర్‌లోని రికరింగ్ డిపాజిట్లపై కూడా 6.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. 60 నెలల కాల పరిమితిలోని రికరింగ్ డిపాజిట్లపై కూడా ఇదే వడ్డీ రేటు ఉంది. 90 నెలల టెన్యూర్‌లోని ఆర్డీలపై వడ్డీ రేటు 6 శాతంగా కొనసాగుతోంది. సీనియర్ సిటిజన్స్‌కు 6.75 శాతం వడ్డీ వస్తుంది. ఇక 120 నెలల టెన్యూర్‌లోని ఆర్డీ అకౌంట్లపై కూడా వడ్డీ రేటు 6 శాతంగానే ఉంది. అంటే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్‌కు అధిక వడ్డీ రేటు అందిస్తోందని చెప్పుకోవచ్చు. అందువల్ల మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే వారి పేరుపై ఆర్డీ అకౌంట్ తెరవడం ఉత్తమం.