బ్యాంకులు సాధారణంగా రుణాలకు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును ప్రామాణికంగా తీసుకుంటాయి. అంటే ఈ రేటు ప్రాతిపదికన రుణ రేట్లను నిర్ణయిస్తాయి. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటు కన్నా తక్కువ వడ్డీకి రుణాలు అందించడానికి వీలు ఉండదు. ఎంసీఎల్ఆర్కు రిస్క్ ప్రీమియం, ఇతర చార్జీలు కలుపుకొని రుణ రేట్లను నిర్ణయిస్తారు. బ్యాంక్ ప్రాతిపదికన ఎంసీఎల్ఆర్ మారుతుంది. అందుకే రుణ రేట్లు కూడా వేరుగా ఉంటాయి. అందుకే రుణాలపై తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంక్లో లోన్ తీసుకోవడం ఉత్తమం.