Fixed Deposit | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇకపై డిపాజిట్‌దారులకు అధిక రాబడి లభిస్తుంది.
దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక పాలసీ రేటును పెంచుకుంటూ వెళ్లడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. రెపో రేటు పెంపు వల్ల బ్యాంకులు కూడా వరుస పెట్టి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా ఎఫ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
హెచ్‌డీఎఫ్‌పీ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. 7 రోజుల నుంచి 29 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 2.75 శాతం నుంచి 3 శాతానికి చేరింది. వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్ల మేర పైకి కదిలింది. 30 రోజుల నుంచి 60 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగింది. 3.25 శాతం నుంచి 3.5 శాతానికి ఎగసింది.
61 రోజుల నుంచి 89 రోజుల ఎఫ్డీలపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4 శాతం వడ్డీని అందిస్తోంది. ఇదివరకు ఈ వడ్డీ రేటు 3.25 శాతంగా ఉంది. అంటే వడ్డీ రేటు 75 బేసిస్ పాయింట్లు పైకి చేరింది. 90 రోజుల నుంచి 6 నెలల టెన్యూర్‌లోని ఫిక్స్డ్ డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 4.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇదివరకు వడ్డీ రేటు 3.7 శాతంగా ఉంది.
ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేటు 5.35 శాతం నుంచి 5.5 శాతానికి చేరింది. వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగింది. రెండేళ్ల ఒక రోజు నుంచి మూడేళ్ల టెన్యూర్లపై వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది. మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల టెన్యూర్‌లోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.7 శాతం నుంచి 6.1 శాతానికి చేరింది.
వడ్డీ రేటు 6 నెలల ఒక రోజు నుంచి 9 నెలల టెన్యూర్‌లోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.65 శాతం నుంచి 5 శాతానికి చేరింది. 9 నెలల ఒక రోజు నుంచి ఏడాది టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 4.65 శాతం నుంచి 5 శతానికి చేరింది. ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్డీలపై వడ్డీ 5.5 శాతం నుంచి 5.7 శాతానికి చేరింది. 20 బేసిస్ పాయింట్లు పెరిగింది. రెండేళ్ల ఒక రోజు నుంచి మూడేళ్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.8 శాతానికి చేరింది. ఇది వరకు వడ్డీ రేటు 5.5 శాతంగా ఉండేది.
మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల టెన్యూర్‌లోని ఎఫ్డీలపై వడ్డీ రేటు 6.1 శాతంగా ఉంది. ఐదేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల ఎఫ్డీలపై వడ్డీ రేటు 6 శాతానికి చేరింది. ఇదివరకు వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్స్‌కు 0.5 శాతం అధిక వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ కన్నా ముందే డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే 1 శాతం వడ్డీ రేటు తగ్గుతుంది.