కేంద్ర ప్రభుత్వం అన్నదాతల మేలు కోసం అనేక రకాల పథకాలను తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వల్ల రైతులకు లబ్ది చేకూరుతుంది. అర్హులైన లబ్దిదారులకు ఈ పథకం ద్వారా రూ.2000 చొప్పున మూడు విడతలుగా అందజేస్తుంది. మొత్తం ఏడాదిలో రూ.6000 పెట్టుబడి సాయంగా మోదీ సర్కార్ రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.