1. నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS): పన్ను ఆదా చేయడానికి NPS ఓ మంచి అవకాశం. అయితే ఇందులో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీకు 60 ఏళ్లు నిండిన తర్వాతే డబ్బులు వెనక్కి వస్తాయి. మధ్యలో డబ్బులు తీసుకోవాలంటే కేవలం 20 శాతం వరకే అనుమతి ఉంటంది. సెక్షన్ 80(సీసీడీ) కింద మీరు ఎన్‌పీఎస్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు పెట్టుబడి పెట్టి పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80 సీతో కలిపితే మొత్తం రూ.2 లక్షల వరకు మినహాయింపు లభించినట్టే.
2. ఎడ్యుకేషన్ లోన్‌పై వడ్డీ: మీరు మీ పిల్లలు, కుటుంబ సభ్యులు లేదా మీ కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఆ రుణంపై చెల్లించే వడ్డీకి సెక్షన్ 80ఈ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. దీనికి గరిష్ట పరిమితి ఏమీ లేదు.
3. ఆరోగ్య బీమా: మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారా సెక్షన్ 80 డీ కింద రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
4. ఇంటి రుణంపై వడ్డీ: ఇంటి రుణంపై చెల్లించే వడ్డీకి సెక్షన్ 80 ఈఈ కింద రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇది వడ్డీకి మాత్రమే పరిమితం.
5. హౌజ్ రెంట్ అలవెన్స్(HRA): సెక్షన్ 80 జీజీ కింద హౌజ్ రెంట్ అలవెన్స్(HRA) పొందొచ్చు. పరిమితి ఎంత అన్నది మీరు నివసించే ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది.