IT Company : ఐటీ ఉద్యోగాలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. కానీ ఎప్పుడు జాబ్ పోతుందో చెప్పలేం. ఎంతో టాలెంట్ ఉన్న ఉద్యోగులను సైతం కంపెనీలు సడెన్‌గా తొలగిస్తుంటాయి. లేఆఫ్స్ (Layoff) ప్రకటించి.. ఫ్యూచర్‌ని టెన్షన్లో పడేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఐతే.. ఓ ఐటీ కంపెనీ మాత్రం ఉద్యోగులను కొనసాగించడమే కాదు... వారికి కార్లను గిఫ్టుగా ఇచ్చి.. తన రూట్ సెపరేట్ అని నిరూపించుకుంది. (image credit - twitter - @TridhyaT)
గుజరాత్.. అహ్మదాబాద్‌కి చెందిన త్రిద్య టెక్ (Tridhya Tech) కంపెనీ ఈ సాహసం చేసింది. తమ ఉద్యోగుల్లో కొంత మందికి కాస్ట్లీ కార్లను గిఫ్టుగా ఇచ్చింది. ఎందుకంటే కంపెనీని స్థాపించి.. ఐదేళ్లు పూర్తి అయిన సందర్భంగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ లాభాలను ఉద్యోగులతో పంచుకుంటున్నట్లు చెప్పింది. (image credit - pexels)
అసలు ప్రపంచంలో ఐటీ కంపెనీలకు ఏమైంది? ఎందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి అనేది తేలాల్సిన ప్రశ్న. కోవిడ్ సమయంలో చాలా రంగాలు దెబ్బతిన్నాయి. ఆ పరిస్థితి నుంచి ప్రపంచ దేశాలు కోలుకోలేదు. అందువల్ల కంపెనీలన్నీ ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. దీని వల్ల ప్రజల మధ్య మనీ సప్లై అనేది తగ్గిపోతోంది. ఇది క్రమంగా ఆర్థిక మాంద్యానికి దారితీస్తోంది. (image credit - pexels)
గూగుల్ , సహా పెద్ద కంపెనీలన్నీ ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. (image credit - pexels)" width="1920" height="2876" /> ఆర్థిక మాంద్యం సమయంలో.. ప్రజల చేతిలో డబ్బు నానాటికీ తగ్గిపోతూ ఉంటుంది. ఫలితంగా పనులు దొరకవు. పనులు ఎప్పుడైతే దొరకవో.. మనీ ప్రవాహం మరింత పడిపోతుంది. దాంతో.. కంపెనీల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేవు. ఇలా ఇదో సైకిల్ చక్రంలాగా ఒకటి తర్వాత ఒక సమస్య వస్తూనే ఉంటాయి. ఇలాంటప్పుడు.. జాగ్రత్తగా వ్యవహరించకపోతే.. అసలుకే సమస్య వస్తుందని భావిస్తూ గూగుల్, అమెజాన్ సహా పెద్ద కంపెనీలన్నీ ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. (image credit - pexels)