1. లగ్జరీ లేబుల్ బ్రాండ్ అయిన గూచీ (Gucci), స్పోర్ట్స్‌వేర్ సంస్థ అయిన అడిడాస్ ఏజీ (Adidas AG) కలిసి ఓ గొడుగును తయారు చేశాయి. ఆ గొడుగు ధర ఎంతో తెలుసా? 1,644 డాలర్లు. భారతీయ కరెన్సీ లెక్క ప్రకారం రూ.1,27,000. అంటే లక్షా 27 వేల రూపాయలు. ఈ గొడుగు ధర అందరూ షాకవుతున్నారు. గొడుగు కోసం ఇంత చెల్లించాలా అని అవాక్కవుతున్నారు. (image: Gucci)
2. ఈ గొడుగుపై చైనాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. చైనాలోనే కాదు... ఈ గొడుగు ధర చూసిన ప్రతీ ఒక్కరూ షాకవుతున్నారు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? ఇది సన్ అంబ్రెల్లా. అంటే ఎండలో మాత్రమే వాడాల్సిన గొడుగు. వర్షంలో వాడకూడదు. వాటర్ ప్రూఫ్ కాదు. కనీసం వర్షంలో వాడలేని గొడుగు ధర ఇంతా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. (image: Gucci)
5. ఈ గొడుగు ఎవరైనా ఆర్డర్ చేస్తే రెండు మూడు రోజుల్లో డెలివరీ చేస్తామని కంపెనీ ప్రకటించింది. డెలివరీ ఉచితం. భారతదేశంలోని కస్టమర్లు కూడా ఫోన్ కాల్ ద్వారా ఈ గొడుగు ఆర్డర్ చేయొచ్చని కంపెనీ వెబ్సైట్లో వివరాలున్నాయి. అయితే ఇంత ఖరీదైన గొడుగు కొనడానికి ఎవరు ముందుకొస్తారన్నది సస్పెన్స్. (image: Gucci)
6. 2025 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ మార్కెట్‌గా మారబోతున్న చైనాలో ఈ గొడుగు పెద్ద చర్చకే దారితీసింది. ఏది ఏమైనప్పటికీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ చర్యల కారణంగా చైనాలో లగ్జరీ బ్రాండ్లు తీవ్రమైన పరిశీలనల్ని ఎదుర్కొంటున్నాయి. చైనాలో పెరుగుతున్న జాతీయవాదం నేపథ్యంలో అడిడాస్ లాంటి పాశ్చాత్య బ్రాండ్లు పోరాడుతున్నాయి. (image: Gucci)