1. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ (GST Council) 47వ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ కొన్ని ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులపై మినహాయింపులు ఉండేవి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆ మినహాయింపుల్ని తొలగించడంతో ఆ ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తుల ధరలు పెరగబోతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ప్రీ-ప్యాక్డ్, ప్రీ-లేబుల్డ్ పెరుగు, లస్సి, బటర్ మిల్క్ లాంటి వస్తువుల ధరలు పెరగబోతున్నాయి. పెరుగు, లస్సీ లాంటి పాల ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ వర్తించనుంది. ఇప్పటి వరకు ఎలాంటి పన్నులు లేని వీటిపై ఇక జీఎస్టీ చెల్లించక తప్పదు. కాబట్టి డెయిరీ కంపెనీలు ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇప్పటికే పాల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు పాల ఉత్పత్తులపైన జీఎస్టీ అమలులోకి రానుంది. దీంతో పాలతో తయారు చేసిన ఉత్పత్తుల ధరలు పెరగబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వీటిపై 5 శాతం జీఎస్టీ విధించడంతో డెయిరీ కంపెనీలు ధరలు పెంచి ఆ భారాన్ని కస్టమర్లపైన వేయనున్నాయి. దీంతో కస్టమర్లు అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి తప్పదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇప్పటికే ఐస్‌క్రీమ్, చీజ్, నెయ్యి, పన్నీర్ లాంటివాటిపై జీఎస్టీ ఉంది. పెరుగు, లస్సీపై జీఎస్టీ విధిస్తే ఇక పాల ఉత్పత్తులన్నీ జీఎస్టీ గొడుగు కిందకు వస్తాయి. అయితే ప్యాకేజ్డ్ పాలపై జీఎస్టీ లేకపోవడం కాస్త ఉపశమనం కలిగించే విషయం. పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాలపైనే కాదు, ఇతర వస్తువులపైనా జీఎస్టీ పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్, కత్తులు, పెన్సిల్ షార్పెనర్స్, బ్లేడ్లు, ఫోర్క్స్, స్పూన్స్, సెంట్రిఫ్యుగల్ పంప్స్, డీప్ ట్యూబ్ వెల్ టర్బైన్ పంప్స్, సబ్మెర్సిబుల్ పంప్స్, బైస్కిల్ పంప్స్, వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, గుడ్లను శుభ్రపర్చేందుకు ఉపయోగించే యంత్రాలు, డెయిరీ పరిశ్రమలో వాడే మెషీన్లపై జీఎస్టీ 12 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎల్ఈడీ బల్బులు, లైట్లు, ఇతర పరికరాలు, మెటల్ ప్రింటెడ్ సర్క్యుట్ బోర్డులు, రోడ్లు, బ్రిడ్జీలు, మెట్రో, ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, క్రిమెటేరియం పనులు, టెట్రా ప్యాక్‌లపై జీఎస్టీ 12 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. క్లీనింగ్, సార్టింగ్, గ్రేడింగ్, విత్తనాలు, ధాన్యాల కోసం ఉపయోగించే యంత్రాలు, మిల్లింగ్ పరిశ్రమలో వాడే యంత్రాలు, వెట్ గ్రైండర్ లాంటి వాటిపై జీఎస్టీ ఏకంగా 5 శాతం నుంచి 18 శాతానికి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
8. సోలార్ వాటర్ హీటర్, సిస్టమ్, ప్రిపేర్డ్, ఫినిష్డ్ లెదర్, స్కిన్, లెదర్ గూడ్స్, ఫుట్‌వేర్, మట్టి ఇటుకలు, ఇ-వేస్ట్, పెట్రోలియం, కోల్ బెడ్ మిథేన్‌పై జీఎస్టీ 5 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. కట్ డైమండ్స్, పాలిష్డ్ డైమండ్స్‌పై పన్ను 0.25 శాతం నుంచి 1.50 శాతానికి పెరిగింది. బ్యాంకులు జారీ చేసే చెక్ బుక్స్‌పై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)