BHIM UPI | బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు. కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. రూపే డెబిట్ కార్డు లావాదేవీలను ప్రోత్సహించడానికి, అలాగే భీమ్ యూపీఐ ద్వారా తక్కువ విలువ ట్రాన్సాక్షన్లను పెరిగేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం బ్యాంకులక అందించే ప్రోత్సాహకాలపై ఎలాంటి జీఎస్టీ ఉండదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. దీని వల్ల చాలా మంది ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
కాగా బ్యాంక్ కస్టమర్లు పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా ఎక్కువగా యూపీఐ లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే భీమ్ యాప్ కూడా ఉంది. దీని ద్వారా కూడా సులభంగానే డబ్బులు పంపొచ్చు. పొందొచ్చు. అలాగే ఇతర పేమెంట్లు కూడా చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వమే ఈ యాప్‌ను అందిస్తోంది. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఈ యాప్ కూడా వాడొచ్చు.