1. చాలా కాలం తర్వాత జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఈ 48వ సమావేశం పూర్తిగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలోని ఈ కమిటీలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ సమావేశంలో చిల్కా, కాన్సంట్రేట్స్, పప్పుల పొట్టుపై పన్ను ఎత్తివేయాలని, ఇథైల్ ఆల్కహాల్‌పై జీఎస్టీ 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. అయితే ఏ వస్తువుపైనా GST రేటు పెంచలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అధికారిక ప్రకటన మేరకు.. జీఎస్టీ కౌన్సిల్ చిల్కా, పప్పు దినుసుల పొట్టు, చుని/చూరి వంటి కాన్సంట్రేట్స్పై జీఎస్టీని 5 శాతం నుంచి జీరోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. అయితే మోటార్ స్పిరిట్ (పెట్రోల్)లో కలపడానికి రిఫైనరీలకు సరఫరా చేసే ఇథైల్ ఆల్కహాల్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఎక్స్ట్రాషన్ ప్రక్రియను ఉపయోగించి తయారు చేసే రబ్ (రబ్-సలావత్), ఫ్రైమ్లపై 18 శాతం జీఎస్టీ ఉంటుందని కౌన్సిల్ స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇంజిన్ సామర్థ్యం 1500 cc కంటే ఎక్కువ, పొడవు 4000 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm లేదా పైన ఉంటే SUVలపై 22 శాతం కాంపెన్షేషన్ సెస్ అమలవుతుందని కౌన్సిల్ పేర్కొంది. KPMG పార్ట్నర్, లీడర్(ఇండైరెక్ట్ ట్యాక్సెస్) అభిషేక్ జైన్ మాట్లాడుతూ.. SUVలు/MUVలకు వర్తించే కాంపెన్షేషన్ సెస్ రేటుపై కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. GST కౌన్సిల్ సమావేశం 22 శాతం కాంపెన్షేషన్కు నాలుగు షరతులను పేర్కొనడంతో సమస్యకు స్వస్తి పలికినట్లు భావించవచ్చని తెలిపారు. పెట్రోలియం కార్యకలాపాల కోసం దిగుమతి చేసుకునే నోటిఫికేషన్ నెం.1/2017-CTR షెడ్యూల్ I కింద 5 శాతం తక్కువ ధర కేటగిరీకి వచ్చే వస్తువులు 5 శాతం తక్కువ రేటును ఆకర్షిస్తాయని కౌన్సిల్ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. GST కౌన్సిల్ మూడు అంశాలను నేరంగా పరిగణించాలని సిఫార్సు చేసింది . వాటిలో అధికారి విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం లేదా నిరోధించడం, మెటీరియల్ ఎవిడెన్స్‌ని ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడం, సమాచారం అందజేయకపోవడం వంటివి ఉన్నాయి. నకిలీ ఇన్వాయిస్లు మినహా అన్ని నేరాలకు GST చట్టాల ప్రకారం ప్రాసిక్యూషన్ చేయడానికి అవసరమైన లిమిట్‌ను రూ.కోటి నుంచి రూ.2 కోట్లకు పెంచింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. రూపే డెబిట్ కార్డ్‌లు, తక్కువ విలువ కలిగిన BHIM-UPI లావాదేవీల ప్రమోషన్ కోసం కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించే మొత్తంపై పన్ను ఉండదని తెలిపింది. మెంథా ఆయిల్‌కు చేసినట్లే రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద మెంథా ఆర్వెన్సిస్ సరఫరాను కూడా చేర్చాలని GST కౌన్సిల్ నిర్ణయించింది. రివర్స్ ఛార్జ్ కింద సరఫరాదారు కి బదులుగా వస్తువులు లేదా సేవల గ్రహీత GST చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)