1. చండీగఢ్‌లో 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. రెండు రోజుల సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల్లో కొన్ని ప్రజలకు ఉపశమనం కల్పించేవి ఉంటే, మరిన్ని భారాన్ని మోపేవి ఉన్నాయి. మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్, తేనె లాంటి ప్రీప్యాక్డ్ ఆహారపదార్థాలపై 5 శాతం జీఎస్టీ విధించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇక బియ్యం, గోధుమలు లాంటి ధాన్యాలను ప్యాక్ చేసినా 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కూడిన ప్యానెల్, ప్యాక్ చేసిన, లేబుల్ చేసిన ఆహార పదార్థాలను జీఎస్టీ నుంచి మినహాయింపును సమీక్షించాలన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫార్సును పరిశీలించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రస్తుతానికి ప్రీ-ప్యాక్డ్, లేబుల్డ్ మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్, తేనే, ఎండిన చిక్కుడు గింజలు, ఎండిన మఖానా, గోధుమలు, ఇతర ధాన్యాలు, గోధుమ పిండి, మెస్లిన్ పిండి, బెల్లం, మురమురాలు, ఇతర వస్తువులు, సేంద్రీయ ఎరువులు, కొబ్బరి కాంపోస్ట్ లాంటివాటికి ప్రస్తుతం జీఎస్టీ మినహాయింపు లభించదు. 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక బ్యాంకులు ఇచ్చే చెక్ బుక్‌పై జీఎస్టీ చెల్లించాలి. చెక్కుల్ని విడిగా ఇచ్చినా పుస్తకం రూపంలో ఇచ్చినా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఇక ఒక రోజుకు రూ.1,000 లోపు ధరలు ఉన్న హోటల్ గదులకు 12 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ప్రస్తుతం ఇది పన్ను మినహాయింపు కేటగిరీలో ఉంది. కాబట్టి కస్టమర్లు 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆస్పత్రుల్లో తీసుకునే రూమ్స్‌కి జీఎస్టీ చెల్లించాలి. ఐసీయూ తప్ప రూ.5,000 కన్నా ఎక్కువ డైలీ రెంట్ ఉన్న గదులకు 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తించదు. ఎల్ఈడీ లైట్స్, బల్బుల ధరలు పెరిగే అవకాశం ఉంది. వీటిపై జీఎస్టీ కౌన్సిల్ 12 శాతం జీఎస్టీ బదులు 18 శాతం జీఎస్టీ వసూలు చేయాలని సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)