Gravton Quanta: రూ.400తో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వెళ్లొచ్చు.. ఎలక్ట్రిక్ బైక్ అదిరింది!
Gravton Quanta: రూ.400తో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వెళ్లొచ్చు.. ఎలక్ట్రిక్ బైక్ అదిరింది!
Electric Bike | మీరు కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేాయాలని భావిస్తున్నారా? అయితే ఈ ఆప్షన్ ఒకసారి పరిశీలించండి. ఈ బైక్ ద్వారా కేవలం రూ. 400 ఖర్చుతో 4 వేలకు పైగా కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
Electric Vehicles | ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లో కొనుగోలుకు లభిస్తోంది. ఎలక్ట్రిక్ టూవీలర్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
2/ 9
గ్రేవ్టన్ మోటార్స్ కంపెనీ క్వాంటా పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం చూస్తే.. ఈ బైక్‌లో కన్యా కుమారి నుంచి కశ్మీర్‌కు 6.5 రోజుల్లో వెళ్లొచ్చు. 11 రాష్ట్రాల ద్వారా దాదాపు 4 వేలకు పైగా కిలోమీటర్ల ప్రయాణం ఇది.
3/ 9
గ్రేవ్టన్ మోటార్స్ వెబ్సైట్ ప్రకారం.. ఈ ట్రిప్‌కు అయిన ఫ్యూయెల్ ఖర్చు కేవలం రూ. 400 మాత్రమే. అంటే కేవలం రూ. 400తో ఈ ఎలక్ట్రిక్ బైక్ ద్వారా కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు వెళ్లొచ్చు. ఇంత తక్కువ ధరలో అంత దూరం ప్రయాణం అంటే చెప్పుకోదగ్గ అంశమే.
4/ 9
క్వాంటా ఎలక్ట్రిక్‌లో పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టుకోవచ్చు. అందువల్ల ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలు కలుగుతుంది. అలాగే మీ లొకేషన్‌కే బ్యాటరీని ఆర్డర్ చేయొచ్చు. ఇలా చాలా ఉపయోగకరమైన సదుపాయం.
5/ 9
అంతేకాకుండా మరో ఆప్షన్ కూడా ఉంది. బ్యాటరీ స్టేషన్లలో వెహికల్లోని బ్యాటరీని స్వాప్ చేసుకోవచ్చు. అంటే మీ బ్యాటరీ ఇచ్చేసి స్టేషనలోని చార్జింగ్ ఉన్న బ్యాటరీని తీసుకోవచ్చు. దీని వల్ల కూడా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఊరట లభిస్తుంది.
6/ 9
ఈ బైక్‌లో 250 కేజీ పేలోడ్ కెపాసిటీ, హై టార్క్ మోటార్, 17 ఇంచుల లార్జ్ వీల్స్, ట్యూన్డ్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ బైక్‌లో బీఎల్బీసీ హబ్ మోటార్ ఉంటుంది. దీని వల్ల ఈ బైక్ ఏకంగా 250 కేజీల బరువును కూడా మోయగలదు.
7/ 9
అంతేకాకుండా ఈ బైక్‌ను యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. అంటే యాప్ ద్వరా ఫైండ్ మై బైక్, యాంటీ థెఫ్ట్ వెహికల్ ట్రాకింగ్, బ్యాటరీ ఆర్డర్, స్వాప్ బ్యాటరీ స్టేషన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు పొందొచ్చు.
8/ 9
ఎలక్ట్రిక్ బైక్‌లో ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ బైక్ ఏకంగా 110 కిలోమీటర్లు వెళ్తుంది. సిటీ మోడ్‌లో ఈ రేంజ్ లభిస్తుంది. అదే ఎకో మోడ్‌లో అయితే ఇంకా ఎక్కువ దూరం వెళ్లొచ్చు.
9/ 9
ఎకో మోడ్‌లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏకంగా 160 కిలోమీటర్లు వెళ్తుంది. ఇక స్పోర్ట్ మోడ్ కూడా ఉంది. ఈ మోడ్‌లో బైక్ ద్వారా 85 కిలోమీటర్లు వెళ్లొచ్చు. డ్యూయెల్ బ్యాటరీ ఆప్షన్ అయితే ఏకంగా 320 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. బ్యాటరీ కెపాసిటీ 3 కేడబ్ల్యూహెచ్. బ్యాటరీ ఫుల్ చార్జ్ కావడానికి 3.5 గంటలు పడుతుంది.