స్కామర్లు అమాయక ప్రజల నుంచి డబ్బు, వ్యక్తిగత వివరాలను దొంగిలించడానికి ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సైబర్ కేటుగాళ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యూజర్లను ఫేక్ ఎస్ఎంఎస్ (Fake SMSes)ల ద్వారా టార్గెట్ చేస్తున్నారు. ఈ కొత్త స్కామ్ (New Scam) గురించి ఎస్బీఐ తన కస్టమర్లను తాజాగా హెచ్చరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ నేపథ్యంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కూడా ఈ కొత్త ఎస్ఎంఎస్ స్కామ్ (New SMS Scam) గురించి ఎస్బీఐ వినియోగదారులను హెచ్చరిస్తోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయమని పీఐబీ ఖాతాదారులను హెచ్చరిస్తోంది. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
"మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది" అని తెలియజేసే మెసేజ్‌ల పట్ల ఎస్బీఐ యూజర్లు జాగ్రత్త వహించాలని పీఐబీ కోరుతోంది. స్కామర్లే ఎస్ఎంఎస్ల ద్వారా ఇలాంటి హెచ్చరికలను పంపుతున్నారని పీఐబీ వెల్లడించింది. అలాంటి మెసేజ్‌లు లేదా కాల్స్‌కు కూడా స్పందించవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎస్బీఐ వినియోగదారులను హెచ్చరిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
* ఎస్బీఐ అకౌంట్ హోల్డర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయాలని వచ్చే ఈమెయిల్‌లు/ ఎస్ఎంఎస్లకు ఎస్బీఐ ఖాతాదారులు అస్సలు స్పందించకూడదు. ఈ ఎస్ఎంఎస్లు వెంటనే డిలీట్ చేసుకోవాలి. ఈ తరహా మెసేజ్ వస్తే... వారు వెంటనే report.phishing @sbi.co.inలో దాని గురించి రిపోర్ట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
తద్వారా బ్యాంక్ తక్షణ చర్య తీసుకుంటుంది. స్కామర్లు ఫేక్ ఎస్బీఐ మెసేజ్ ద్వారా, ఖాతా "బ్లాక్" అయ్యిందని.. వ్యక్తిగత "డాక్యుమెంట్స్" సబ్మిట్ చేయాలని యూజర్లను కోరుతున్నారని పీఐబీ వివరించింది. యూజర్లు తమ ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేసుకోవడానికి మెసేజ్‌తో పంపిన లింక్‌పై క్లిక్ చేయమని మెసేజ్ ద్వారా స్కామర్లు అడుగుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇందులో వ్యాకరణ దోషాలు, ఫార్మాట్ సమస్యలు, కామ, ఫుల్ స్టాప్స్ లోపాలు ఉన్నాయి. అలానే ఈ మెసేజ్‌లో ఉన్న లింక్ అధికారిక ఎస్బీఐ వెబ్సైట్లో కూడా లేదు. దీన్నిబట్టి ఏది ఫేక్ మెసేజ్ అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. బ్యాంకులు ఎల్లప్పుడూ అధికారిక బ్యాంక్ కాంటాక్ట్ నుంచి ఎస్ఎంఎస్లు పంపుతాయి. సాధారణంగా అన్ని స్కామ్ మెసేజ్‌లలో వ్యాకరణ దోషాలు ఉంటాయి. ప్రస్తుతం హల్చల్ చేస్తున్న మెసేజ్‌లో కూడా గ్రామటికల్ మిస్టేక్స్ (Grammatical Mistakes) ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఫేక్ మెసేజ్‌లు, హానికరమైన లింక్‌లతో స్కామర్లు ఎస్బీఐ వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో స్కామర్లు ఎస్బీఐ యూజర్లను వారి బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలను అందించి తామిచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా కేవైసీని పూర్తి చేయమని కోరారు. బ్యాంకు ఖాతాను ఖాళీ చేయాలనే దుర్బుద్ధితోనే ఇలా మెసేజ్ పంపించారు. ఈసారి కూడా వారిది అదే లక్ష్యం. కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)