1. రోడ్డు ప్రమాదాల్లో టూవీలర్ నడిపేవారు ఎక్కువగా మరణిస్తుంటారు. గాయాలపాలవుతుంటారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఎక్కువ మంది మరణిస్తుంటారు. ఈ మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యల్ని తీసుకుంటోంది. అందులో భాగంగా తాజాగా మోటార్ వెహికిల్ చట్టం 1988 లో పలు మార్పులు చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. హెల్మెట్ సరిగ్గా ధరించకపోయినా ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. సరిగ్గా హెల్మెట్ ధరించకపోతే రూ.2,000 వరకు జరిమానా చెల్లించాల్సిందే. ఏఏ సందర్భాల్లో ఎంత ఫైన్ ఉంటుందో కూడా వివరించింది ప్రభుత్వం. టూవీలర్ నడిపేవారు హెల్మెట్ ధరించి బకిల్ అంటే హెల్మెట్‌కు ఉండే బెల్ట్ పెట్టుకోకపోతే రూ.1,000 జరిమానా చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక ఏ హెల్మెట్ పడితే ఆ హెల్మెట్ వాడినా చిక్కులు తప్పవు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్స్ మాత్రమే ధరించాలి. బీఎస్ఐ సర్టిఫికేషన్ లేని హెల్మెట్ ధరిస్తే రూ.1,000 జరిమానా చెల్లించాలి. అంటే తక్కువ ధరకు వచ్చే నాన్ స్టాండర్డ్ హెల్మెట్ వాడేవారికి చిక్కులు తప్పవు. (ప్రతీకాత్మక చిత్రం)
6. చాలా మంది ద్విచక్ర వాహనదారులు చలాన్లు తప్పించుకునేందుకు హెల్మెట్‌ను తలపై ఊరికే అలా పెట్టుకుంటూ ఉంటారు. ఇకపై అలా హెల్మెట్ పెట్టుకున్నా ఫైన్ చెల్లించాల్సిందే. బీఎస్ఐ సర్టిఫికేషన్ ఉన్న హెల్మెట్ ధరించి, హెల్మెట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఫైన్ ఉండదు. లేకపోతే ఫైన్ చెల్లించాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)