భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేవి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలుగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ సంస్థలు ఏప్రిల్ ప్రారంభం నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. ఫ్యూయెల్ రేట్లను స్థిరంగానే కొనసాగిస్తూ వస్తున్నాయి.
ఇకపోతే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1111 వరకు ఉంది. ఇక దీనికి డెలివరీ చార్జీలు కలుపుకుంటే రూ.1150 వరకు అవుతోంది. ఇది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి. ఒకప్పుడు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుత రేటులో సగం మాత్రమే ఉండేది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా గరిష్ట స్థాయిల్లోనే స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. దీంతో సామాన్యులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు.