అయితే ఆయన ఇక్కడ మెలిక పెట్టారు. మద్యం, ఇంధనం వంటివి రాష్ట్రాలకు అధిక ఆదాయాన్ని సమకూర్చే అంశాలు. అందువల్ల రాష్ట్రాలు ఈ చర్యకు అంగీకరించే అవకాశం లేదని హర్దీప్ పూరి అన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రాలు అంగీకారం తెలిపితే.. తాము సిద్ధంగా ఉన్నామని హర్దీప్ పూరి తెలిపారు.
కాగా మన దేశంలో చాలా రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఫ్యూయెల్ రేట్లను స్థిరంగా కొనసాగిసున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ రేటు రూ. 109.64 వద్ద, డీజిల్ రేటు రూ. 97.8 వద్ద ఉన్నాయి. కొన్ని నెలలుగా ఇవే రేట్లు కొనసాగుతూ వస్తున్నాయి. ఏపీలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.