కాలుష్యం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రొత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా సబ్సిడీని అందిస్తున్నాయి. ఢిల్లీలోని కేజ్రివాల్ సర్కార్ ఎలక్ట్రిక్ సైకిళ్లపై భారీ సబ్సిడీని అందించనున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం నాలుగు కంపెనీలకు చెందిన 11 ఎలక్ట్రిక్ సైకిళ్ల మోడల్లను సబ్సిడీ కోసం ఆమోదించింది. ఈ మోడళ్లు ఇప్పటివరకు సబ్సిడీకి అర్హుత కలిగి ఉన్నాయి. అయితే రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో హీరో లెక్ట్రో ఈ-సైకిల్, నెక్స్‌జూ మొబిలిటీ లిమిటెడ్, స్ట్రైడర్ సైకిల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మోటర్వోల్ట్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీల మోడల్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
సబ్సిడీలకు ముందు ప్రభుత్వం ఆమోదించిన ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్ ధర రూ.31,000 నుంచి రూ.55,000 వరకు ఉంటుంది. సబ్సిడీ ప్రయోజనాన్ని పొందడానికి.. ప్రభుత్వం ఆన్లైన్ పోర్టల్‌ను తెరిచింది, దీనిలో డీలర్లు అర్హులైన కొనుగోలుదారుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పోర్టల్ ప్రారంభమైన మొదటి రోజు బుధవారం ఇద్దరు కొనుగోలుదారుల వివరాలు అప్లోడ్ చేయబడ్డాయి. ఆమోదించబడిన జాబితా నుంచి 20 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ సైకిళ్లు విక్రయించబడ్డాయి.(ప్రతీకాత్మక చిత్రం)