కాగా ఈసారి కంది పప్పు దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉందని ట్రేడర్లు పేర్కొంటున్నారు. అందువల్ల వచ్చే ఏడాదిలో కూడా కంది పప్పు ధరలు మరింత పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే వంట నూనె ధరలు అదుపులోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పామ్ ఆయిల్ రేటు కేజీకి రూ. 104 వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది ఆరంభంలో వంట నూన ధరలు కొండెక్కిన విషయం తెలిసిందే. అయితే తర్వాత మాత్రం ఎడిబుల్ ఆయిల్ రేట్లు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు వంట నూనె ధరలు అదుపులోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు.