ఈ ఏడాది ముందు కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామ్ ఆయిల్‌పై ఇంపోర్ట్ ట్యాక్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో వంట నూనె ధరలను అదుపులో ఉంచడానికి మోదీ సర్కార్ అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది. అయితే క్రూడ్ పామ్ ఆయిల్‌పై కేంద్ర ప్రభుత్వం 5 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను మాత్రం వసూలు చేస్తూనే వస్తోంది.
అలాగే కేంద్ర ప్రభుత్వం ఇంకా రిఫైన్డ్, బ్లీచ్డ్ అండ్ డియోడొరైజ్డ్ (ఆర్బీడీ) పామ్ ఆయిల్‌పై మాత్రం 12.5 శాతం దిగుమతి సుంకాన్ని కొనసాగిస్తూ వచ్చింది. క్రూడ్ పామ్ ఆయిల్2పై దిగుమతి సుంకాన్ని తిరిగి తెచ్చే ప్రతిపాదన ఉందని, అలాగే ఆర్బీడీ ఆయిల్‌పై సుంకాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అటు రైతులు, ఇటు కొనుగోలుదారులను ఇద్దరినీ దృష్టి ఉంచుకొని ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేశాయి.
అందువల్ల కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామ్ ఆయిల్, ఆర్బీడీ ఆయిల్‌పై దిగుమతి సుంకాలను కనీసం 10 శాతం పెంచాల్సి ఉందని మెహతా పేర్కొంటున్నారు. ఆయిల్ సీడ్ ధరల తగ్గుదల నేపథ్యంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశీయంగా రైతులకు ప్రోత్సహించడానికి క్రూడ్ పామ్ ఆయిల్‌కు, ఆర్బీడీ మధ్య సుంకం వ్యత్యాసం 12 నుంచి 13 శాతం వరకు ఉండాలని సూచించారు.