1. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో గ్లోబల్ కంపెనీలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే మెటా, అమెజాన్, ట్విట్టర్ వంటి బడా కంపెనీలు పెద్ద ఎత్తున్న ఉద్యోగులను తొలగించాయి. తాజాగా గూగుల్ సైతం ఇదే బాటలో నడువనున్నట్లు సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
2. పదివేల మంది ఉద్యోగులను క్రమంగా వదిలించుకోవడానికి పర్ఫార్మెన్స్ ఇంప్రూమెంట్ ప్లాన్‌ను రానున్న రోజుల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యాక్టివిస్ట్ హెడ్జ్ ఫండ్, ప్రతికూల మార్కెట్ ఒత్తిడి, ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరాలతో గూగుల్ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. లో పర్ఫార్మెన్స్ రేటింగ్స్ పొందిన ఉద్యోగులు తమ జాబ్‌ను కోల్పోతారని సమాచారం. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, స్టాక్ అవార్డ్స్ ఇవ్వకుండా నిరోధించడానికి కూడా ఈ కొత్త పర్ఫార్మెన్ సిస్టమ్ రేటింగ్స్‌ను గూగుల్ ఉపయోగించవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే గూగుల్ లేదా, దాని పేరెంట్ కంపెనీ అల్ఫాబెట్ ఈ ప్లాన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. హెడ్జ్ ఫండ్ బిలియనీర్ క్రిస్టోఫర్ హోన్.. ఆల్ఫాబెట్‌కు రాసిన లేఖలో కంపెనీలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇతర డిజిటల్ కంపెనీలతో పోలిస్తే గూగుల్ తమ ఉద్యోగులకు అధిక వేతనాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. హైరింగ్ విధానాలతో పోల్చితే కంపెనీ హెడ్‌కౌంట్ అధికంగా ఉందని, ఇది ప్రస్తుత వ్యాపార పరిస్థితుల అవసరాలకు అనుగుణంగా లేదని Hohn పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. పరిమిత సంఖ్యలోని హైలీ-కాంపెన్సేటెడ్ స్పెషలిస్ట్స్, వారి సామర్థ్యాలతో గూగుల్‌ను సమర్థవంతంగా అడ్మినిస్ట్రేట్ చేయవచ్చు అని హోన్ అభిప్రాయపడ్డారు. బ్యాడ్ పర్ఫార్మెన్స్కు సంబంధించి 6% స్టాఫ్ లేదా 10,000 మంది ఉద్యోగులను గుర్తించాలని మేనేజర్లకు గూగుల్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. గతంలో ఇది కేవలం 2 శాతంగా ఉండేది. అంతేకాకుండా గత నోటిఫికేషన్లో పెంచిన స్కోర్లను సైతం తగ్గించాలని సూపర్వైజర్లను ఆదేశించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం.. 2021లో ఆల్ఫాబెట్ ఉద్యోగికి సగటు జీతం దాదాపు 295,884 డారర్లు. ఇది మైక్రోసాఫ్ట్ తన సిబ్బందికి చెల్లించే జీతం కంటే 70 శాతం ఎక్కువ. యునైటెడ్ స్టేట్స్‌లోని 20 అతిపెద్ద టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు చెల్లించే దాని కంటే ఆల్ఫాబెట్ తన ఉద్యోగులకు 153 శాతం ఎక్కువగా జీతాలు చెల్లించింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ట్విట్టర్లో ఎలాన్ మస్క్ అవలంభిస్తున్న కాన్సెప్ట్‌తో హోన్ రివ్యూకు పోలిక ఉంది. Twitter, Amazon , Meta వంటి టాప్ కంపెనీలు US-బేస్డ్ డిజిటల్ వ్యాపారాలు ఖర్చులను ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కేవలం ఒక నెల క్రితం నుంచి మెజారిటీ కంపెనీలు భారీ స్థాయిలో లేఆఫ్స్‌కు తెరలేపాయి. (ప్రతీకాత్మక చిత్రం)