అయితే మిగతా సిబ్బంది కూడా వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్‌లకు రావాలని గూగుల్ ఉద్యోగులను కోరుతోంది. కంపెనీ ఆఫీస్ వర్క్ తిరిగి ప్రారంభించిందని, ఈమేరకు కంపెనీలోని కొంతమంది ఉద్యోగుల ఈమెయిల్స్‌కు నోటీసులు వచ్చాయని సీఎన్‌బీసీ న్యూస్ పోర్టల్ వెల్లడించింది. అయితే ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి ప్రస్తుతం సుముఖత వ్యక్తం చేయడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు తమ నిస్పృహలను మీమ్స్ ద్వారా వెల్లడిస్తున్నారు.
లాస్ ఏంజెల్స్ పబ్లిక్ హెల్త్ డ్యాష్‌బోర్డ్ ప్రకారం.. ఇతర కంపెనీలతో పోల్చితే గూగుల్ ఆఫీస్ల్లోనే ప్రస్తుతం అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. Deadline.com ప్రకారం.. కాలిఫోర్నియాలోని వెనిస్లోని సిలికాన్ బీచ్ ఆఫీస్(Silicon Beach office)లో 145 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. అలాగే ప్లేయా విస్టా సైట్(Playa Vista site)లో ఉన్న ఆఫీస్‌లో 135 కేసులు బయటపడ్డాయి.
ప్రస్తుతం టీకాలు వేయించుకోని గూగుల్ ఉద్యోగులు సైతం ఆఫీస్ రావడానికి అనుమతి ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. ఇప్పటికే అక్కడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. టీకాలు వేసుకున్న వారికి మళ్లీ వైరస్ సోకుతున్నందున, వ్యాక్సినేషన్ నిబంధనను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కంపెనీ ఎలా స్పందిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
మరోవైపు సైబర్ స్కామ్‌ల నుంచి ఇంటర్నెట్ యూజర్లను కాపాడేందుకు గూగుల్ (Google) నడుం కట్టింది. ఇటీవల జరిగిన సేఫర్ విత్ గూగుల్ (Safer with Google) ఇండియా ఈవెంట్లో ఇంటర్నెట్ యూజర్లను రక్షించడానికి అనుసరించే మార్గాలను వెల్లడించింది. దేశంలోని సుమారు 1 లక్ష మంది డెవలపర్లు, ఐటీ, స్టార్టప్ నిపుణుల కోసం సైబర్ సెక్యూరిటీ అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌ను కూడా కంపెనీ ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ కింద కంపెనీ మల్టీ-సిటీ, హైబ్రిడ్ ఫార్మాట్ సైబర్‌సెక్యూరిటీ రోడ్‌షోను నిర్వహించనుంది.