Bank Account | రూ.లక్ష గెలుచుకునే అద్భుతమైన అవకాశం ఒకటి అందుబాటులో ఉంది. మంచి ఫోటో తీసి పంపిస్తే చాలు.. మీరు లక్ష రూపాయలు పొందే ఛాన్స్ సొంతం చేసుకోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు భారత ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే.
2/ 11
మోదీ సర్కార్ మేళా మూమెంట్స్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతగా నిలిచిన వారికి ఏకంగా రూ. లక్ష లభిస్తాయి. జస్ట్ మీకు ఫోటో తీయడం వస్తే చాలు.. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు.
3/ 11
దేశవ్యాప్తంగా పండుగలు, మేళాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భారత ప్రభుత్వం ఈ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. పండుగ సీజన్ స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ఈ ఫోటోగ్రఫీ పోటీ పెడుతోంది.
4/ 11
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మైగౌవ్‌తో కలిసి ఈ మేళా మూమెంట్స్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మీరు మీ ఊరిలో లేదంటే మీకు దగ్గరిలో జరుగుతున్న ఉత్సవాలు, జాతరలు, పండుగలకు వెళ్లి మంచి ఫోటో తీసుకోవాలి. దీన్ని ప్రభుత్వానికి పంపాలి.
5/ 11
ఇలా పంపిన ఫోటో అందరి కన్నా బెస్ట్‌గా ఉంటే.. అప్పుడు వారికి నగదు బహుమతులను గెలుచుకునే అవకాశం వస్తుంది. ప్రభుత్వం నుంచి ఏకంగా రూ. లక్ష వరకు సొంతం చేసుకోవచ్చు. ఇంకా మరో ఇద్దరికి కూడా బహుమతులు ఉంటాయి.
6/ 11
మేళా వైబ్స్, ఛటోరిగుల్లీ, మేళా ఫేసెస్, మేళా స్టాల్స్ అనే నాలుగు రకాల కేటగిరి కింద మీరు మీకు నచ్చిన ఫోటోను పంపొచ్చు. ఈ కాంటెస్ట్ ఆరు నెలల వరకు ఉంటుంది. ప్రతి నెలా ప్రతి కేటగిరి కింద మూడు ఫోటోలను ఎంపిక చేస్తారు. వీరికి బహుమతులు అందిస్తారు.
7/ 11
ఇలా ఎవరి ఫోటో అయితే విన్నర్‌గా నిలుస్తుందో వారికి రూ. 10 వేల బహుమతి వస్తుంది. రెండో స్థానంలో ఉన్న వారికి రూ. 7,500 వస్తాయి. ఇక మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 5 వేలు చెల్లిస్తారు.
8/ 11
ఇంకా గ్రాండ్ ఫినాలే ఉంటుంది. 2023 ఏప్రిల్ నెలలో ఇది జరుగుతుంది. ఒక్కో కేటగిరి కింద ఎంపికైనా మూడు ఫోటోలు అన్నీ గ్రాండ్ ఫినాలేలో తలపడతాయి. ఈ ఫోటోలలో ఏది బెస్ట్‌గా నిలుస్తుందో.. వారికి రూ. లక్ష బహుమతి లభిస్తుంది.
9/ 11
అలాగే రెండో స్థానంలో ఉన్న వారికి రూ. 75,000 వస్తాయి. ఇక మూడు స్థానంలో ఉన్న వారికి రూ. 50 వేలు అందిస్తారు.
10/ 11
కాగా ఈ కాంటెస్ట్ మార్చి 31 వరకు జరుగుతుంది. ప్రతి నెలా చివరి తేదీ లోపు ఫోటోలు సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆ నెలలో విజేతగా నిలిచిన ఫోటోల జాబితాలోకి చేరొచ్చు. తర్వాత గ్రాండ్ ఫినాలేలో తలపడొచ్చు.
11/ 11
ఇకపోతే ఈ పోటీలో పాల్గొనాలని భావించే వారు మై గౌ వెబ్సైట్లోకి వెళ్లి వారి ఫోటోలను పంపొచ్చు. విజేతగా నిలిచి రూ. లక్ష సొంతం చేసుకోవచ్చు.