WhatsApp Cashback: వాట్సాప్ వినియోగదారులకు బంపరాఫర్.. భారీగా క్యాష్ బ్యాక్.. ఎంతంటే?
WhatsApp Cashback: వాట్సాప్ వినియోగదారులకు బంపరాఫర్.. భారీగా క్యాష్ బ్యాక్.. ఎంతంటే?
వాట్సాప్ లో పేమెంట్స్ (Whatsapp Payments) చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తే క్యాష్ బ్యాక్(Cash Back) అందిస్తోంది వాట్సాప్. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp) పేమెంట్స్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఎక్కువ మంది వినియోగదారులను తమ వైపు ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను తీసుకువచ్చింది వాట్సాప్.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
నగదు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రూ. 51 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అయితే కేవలం ఒక రూపాయి పంపించినా కూడా క్యాష్ బ్యాక్ లభించడం విశేషం. అయితే.. ఈ ఆఫర్ ఐదు ట్రాన్సాక్షన్ల వరకు మాత్రమే వర్తిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
డబ్బులు పంపించిన వెంటనే ఆ క్యాష్ బ్యాక్ మన ఖాతాలో జమ అవుతుంది. అయితే ఈ ఆఫర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
త్వరలోనే ఈ క్యాష్ బ్యాక్ సదుపాయం అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
గతంలో ఫోన్ పే, గూగుల్ పే సైతం మొబైల్ పేమెంట్స్ ప్రారంభించిన సమయంలో క్యాష్ బ్యాక్ అందించాయి. దీంతో అవి వినియోగదారులను అమితంగా ఆకట్టుకున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ప్రస్తుతం వాట్సాప్ సైతం ఆ వినియోగదారులను తన వైపు తిప్పుకునేందుకు అదే దారిలో వెళ్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)