1. భారతీయ రైల్వే జనరల్ బోగీలను ఏసీ కోచ్‌లుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లల్లో బోగీలన్నీ ఏసీ కోచ్‌లు ఉండబోతున్నాయి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం కోసం రైల్వే ఈ మార్పు చేయబోతోంది. ఏసీ జనరల్ క్లాస్ కోచ్‌ల (AC General Class coach) పేరుతో కొత్త బోగీలను పరిచయం చేయనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. సాధారణంగా జనరల్ కోచ్‌లు అన్‌రిజర్వ్‌డ్‌గా ఉంటాయి. కానీ కరోనా వైరస్ మహమ్మారి తర్వాత వీటిని రిజర్వ్డ్ కోచ్‌లుగా మార్చారు. ఇక ఇటీవల ఏసీ ఎకనమీ కంపార్ట్మెంట్స్ని రైల్వే ఆవిష్కరించింది. వీటిలో టికెట్ ధరలు థర్డ్ ఏసీ టికెట్ కన్నా తక్కువగా ఉంటాయి. స్లీపర్ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ఈ బోగీలను రూపొందించింది రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)