Latest Gold Price: కరోనా సెకెండ్ వేవ్ సమయంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ అమాంతం పెరిగాయి. ప్రస్త్తుతం పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చేసుకుంటాయి. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి ప్రియులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు.
కరోనా సెకండ్ వేవ్ తరువాత తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు క్రమంగా మళ్లీ పెరిగాయి. అయితే వారం రోజుల నుంచి పసిడి ధరలు దిగివస్తున్నాయి. తాజాగా బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.45,130 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,130గా కొనసాగుతోంది.
తాజాగా తులం బంగారంపై 260 రూపాయల మేర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఆరు గంటల వరకు నమోదైన రేట్ల వివరాల ప్రకారం చూస్తే.. భారీగా తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఇది మహిళలకు శుభవార్త.. బంగారం కొందాము అనుకునే వారికి ఇదే సరైన సమయం అంటున్నారు బిజినెస్ నిపుణులు.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,580గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,130 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,130గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,560గా ఉంది.
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,250గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230గా ఉంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర 60,000 రూపాయలుగా ఉంది. అయితే.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లోనే వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో 60,000 రూపాయలు కాగా.. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర 60,000 లు కాగా, తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర 64,200 లుగా ఉంది. బెంగళూరులో వెండి ధర కిలో వెండి 60,000 రూపాయలుగా కొనసాగుతోంది. కోల్కతాలో కిలో వెండి ధర 60,000 లుగా ఉంది, కేరళలో కిలో వెండి ధర 64,200 రూపాయలుగా ఉంది.