9 Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు నిజంగా పండగ లాంటి వార్తే ఇదే.. ముఖ్యంగా పెళ్లిల్లు, ఫంక్షన్లు ఉన్నాయని బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇదే సరైన సమయం. ఊహించని విధంగా పసిడి రేటు భారీగా పడిపోయింది. నిన్న నిలకడగా కొనసాగిన బంగారం ధరలు ఈరోజు పూర్తిగా దిగొచ్చాయి. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా పయనించింది. భారీగా పడిపోయింది.
ఇక హైదరాబాద్ విషయానికి మార్కెట్లో బుధవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.750 దిగొచ్చింది. దీంతో బంగారం ధర 49,150 రూపాయలకు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 690 రూపాయలు తగ్గి 45,050కు క్షీణించింది.(Image Credits: Facebook/Israel Antiquities Authority)
ప్రస్తుతం గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి. కారణం ఏదైనా భారీగా బంగారం రేటు తగ్గడంతో పసిడి ప్రియులకు ఇది శుభవార్తే..
బంగారం ధర పడిపోతే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఏకంగా 900 రూపాయల వరకు దిగి వచ్చింది. దీంతో కేజీ వెండి ధర 69,500 రూపాయల వరకు తగ్గింది. దానికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.85 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1790 డాలర్లకు క్షీణించింది. వెండి రేటు కూడా దిగొచ్చింది. ఔన్స్‌కు 2.57 శాతం క్షీణతతో 23.57 డాలర్లకు తగ్గింది.
ఒక వైపు బంగారం ధర తగ్గుతుంటే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 64,000 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబై లో64,400 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.79,500 ఉండగా, కోల్‌కతాలో రూ.64,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,500 ఉండగా, విజయవాడలో రూ.69,500 ఉంది. ఇక కేరళలో కిలో వెండి ధర రూ.69,500 ఉండగా, మధురైలో రూ.69,500 వద్ద కొనసాగుతోంది.