కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న వెండి ధరలకు బ్రేక్ పడింది. రెండు రోజుల నుంచి వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. బుధవారం దేశంలో కిలో వెండి ధర రూ.63,200లుగా ఉంది. కాగా.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి.