హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లే కస్టమర్లకు సర్వీసు ఛార్జీల పేరుతో భారీగా షాకులు ఇస్తూ ఉంటాయి వాటి యాజమాన్యాలు. అయితే.. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) అలాంటి ఛార్జీలకు చెక్ పెట్టేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజగా మార్గదర్శకాలను విడుదల చేసింది. హోటళ్లు రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీల పేరుతో వినియోగదారుల నుంచి ఇష్టారితీగా డబ్బులు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది.
ఆ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది CCPA. వియోగదారులకు వేసే బిల్లుల్లో ఆటోమేటిక్‌గా లేదా మ్యానువల్‌గా సర్వీస్ ఛార్జీలను కలపవద్దని సీసీపీఏ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏ రూపంలోనూ సర్వీస్ ఛార్జీలను వసులు చేయవద్దని మార్గదర్శకాల్లో స్పష్టంగా పెర్కొంది సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. సర్వీస్ ఛార్జీ స్వచ్ఛంద చెల్లింపు అని తెలిపింది.
ఈ విషయాన్ని వినియోగదారులకు సైతం తెలపాలని మార్గదర్శకాల్లో కన్జూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ వివరించింది. ఈ నిర్ణయంతో ఇక మీదట సర్వీస్ ఛార్జీ బిల్లుల్లో కనిపించదు. ఒక వేళా ఏదైనా రెస్టారెంట్ లేదా హోటల్ యాజమాన్యం సర్వీస్ ఛార్జీ పేరిట వినియోగదారుల నుంచి వసూళ్లకు పాల్పడితే.. నిబంధనలు అతిక్రమించినట్లే అవుతుంది.