GOOD NEWS TO BANK EMPLOYEES FAMILY PENSION TO HIKE TO 30 PERCENT OF LAST SALARY HERE IS MORE DETAILS SK
Bank Employees: బ్యాంక్ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. భారీగా పెరగనున్న పెన్షన్
Bank Employees Pension: బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరి ఎంత పెరిగింది? ఇక నుంచి ఎంత పెన్షన్ వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రభుత్వం రంగ బ్యాంకుల్లో పనిచేసిన ఉద్యోగులకు పెన్షన్ భారీగా పెరగనుంది. NPS (నేషనల్ పెన్షన్ స్కీమ్) కింద బ్యాంకు యజమాని అందించే సహకారాన్ని పెంచే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో బ్యాంకు ఉద్యోగుల కుటుంబ పెన్షన్ పెరగనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
బ్యాంకు ఉద్యోగి చివరగా తీసుకున్న జీతంలో 30 శాతం యూనిఫాం స్లాబ్‌లో పెన్షన్ పొందనున్నారు. ఇప్పటివరకు రూ.9,284 గా ఉన్న పెన్షన్ రూ.30,000-35,000కు పెరగనున్నట్లు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(DFS) వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
వివిధ వర్గాల పెన్షనర్లకు 15, 20, 30 శాతం స్లాబ్ రేట్లలో చెల్లించాల్సిన ఫ్యామిలీ పెన్షన్‌ను ఎలాంటి ఫిక్స్డ్ క్యాప్ లేకుండా మెరుగుపరచాలని ఐబీఏ ప్రభుత్వానికి నివేదించింది. ఆ సిఫార్సును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
అంతేకాదు పెన్షన్ కార్పస్‌లో యజమాని సహకారాన్ని (Employer contribution)ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని ప్రభుత్వం బ్యాంకులను కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
కేంద్ర నిర్ణయంతో కరోనా సమయంలో మరణించిన బ్యాంకు ఉద్యోగుల కుటుంబాలకు అందుతున్న పెన్షన్ 30 శాతం పెరిగింది. మరణించిన ఉద్యోగి చివరి జీతం ఆధారంగా దీనిని పెంచారు. (ఫైల్ ఫోటో)
6/ 9
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును సమీక్షించారు. బ్యాంకింగ్ పరిశ్రమ సాధించిన పురోగతి గురించి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో చర్చించారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
ప్రభుత్వరంగ బ్యాంకులు సమిష్టిగా బాగా పనిచేశాయని... కరోనా మహమ్మారి సమయంలో సేవలను పొడిగించినప్పటికీ సత్వర దిద్దుబాటు చర్య నుంచి బయటపడ్డాయని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.26,016 కోట్ల నష్టంతో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.31,817 కోట్ల లాభాన్ని నివేదించాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.
9/ 9
ఐదేళ్ల నష్టాల తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకు లాభాలు పొందడం ఇదే మొదటిసారి. మార్చి 2021 నాటికి మొత్తం స్థూల నిరర్థక ఆస్తులు రూ.6.16 లక్షల కోట్లుగా ఉన్నాయి, మార్చి 2020 నుంచి రూ.62,000 కోట్లు తగ్గాయి.ప్రతీకాత్మక చిత్రం)