2. భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ 2022 అక్టోబర్ 1న ఎస్‌హెచ్‌జీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఎస్‌హెచ్‌జీ-క్రెడిట్ లింకేజీ ప్రోగ్రామ్ 1992 లో ప్రారంభమైంది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలపమెంట్ (NABARD) ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ యాక్టీవ్‌గా పాల్గొంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎస్బీఐ ఎస్‌హెచ్‌జీ సమూహ్ శక్తి ప్రోగ్రామ్‌లో భాగంగా అన్ని జిల్లాల్లోని మహిళా గ్రామీణ బృందాలు 7 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు రుణాలు తీసుకోవచ్చు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు తీసుకునే వారికి ఒక ఏడాది మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక రూ.5 లక్షల పైన రుణాలకు 9 శాతం వడ్డీ వర్తిస్తుంది. స్వయం సహాయక సంఘాలకు రూ.10.00 లక్షల పరిమితి వరకు ఎటువంటి పూచీకత్తు, మార్జిన్ లేకుండా లోన్స్ ఇస్తోంది ఎస్బీఐ. రుణాలు మంజూరు చేసేందుకు డిపాజిట్లు చేయాలని ఒత్తిడి చేయదు బ్యాంకు. ఇక అన్ని జిల్లాల్లోని మహిళా గ్రామీణ బృందాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య రుణాలు తీసుకుంటే క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ (CGFMU) కవరేజీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)