1. మహిళలకు శుభవార్త. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023 (Union Budget 2023) సందర్భంగా ప్రకటించిన మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ (Mahila Samman Saving Certificate) స్కీమ్ ప్రారంభమైంది. ఈ పథకం పోస్ట్ ఆఫీసుల్లో అమలులో ఉంటుందని కేంద్ర ప్రభత్వం ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేవలం మహిళల కోసం ప్రకటించిన పథకం ఇది. బాలికలు కూడా ఈ పథకంలో చేరొచ్చు. భారతదేశంలోని 1.59 లక్షల పోస్ట్ ఆఫీసుల్లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్‌లో చేరొచ్చు. బాలికలు, మహిళలకు ఆర్థిక చేరిక కల్పించడంతో పాటు సాధికారత అందించడం కోసం ఈ స్కీమ్ రూపొందించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ కూడా చేరింది. ఇందులో రెండేళ్ల కాలానికి డిపాజిట్ చేయొచ్చు. ఈ స్కీమ్ రెండేళ్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే 2025 మార్చి వరకు ఈ పథకంలో చేరొచ్చు. మహిళలు లేదా బాలికలు రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ ద్వారా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. 7.5 శాతం వార్షిక వడ్డీ ఆఫర్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మూడు నెలలకోసారి చక్రవడ్డీని లెక్కిస్తుంది ప్రభుత్వం. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కన్నా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ వడ్డీ రేటు ఎక్కువ. (ప్రతీకాత్మక చిత్రం)