1. భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్లల్లో సీట్లు, ఇంటీరియర్ ప్యానెల్స్‌ను టాటా స్టీల్ తయారు చేస్తోంది. 23 కోచ్‌లకు లైట్ వెయిట్ సీట్లను టాటా స్టీల్ తయారు చేస్తోంది. ఇవి వాల్డ్ క్లాస్ సీట్లు అని టాటా స్టీల్ చెబుతోంది. సీటింగ్ సిస్టమ్ మాత్రమే కాదు, ఇంటీరియర్‌ను కూడా టాటా స్టీల్ డిజైన్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. హై-స్పీడ్ రైలులో 16 కోచ్‌ల కోసం ఫైబర్-రీన్ఫోర్స్డ్ పాలిమర్ కాంపోజిట్స్-ఆధారిత ఇంటీరియర్ ప్యానెల్లను కూడా ఉత్పత్తి చేస్తుంది టాటా స్టీల్. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వందే భారత్ రైళ్లకు ఇంటీరియర్, వాల్డ్ క్లాస్ సీటింగ్ సిస్టమ్ రూపొందిస్తున్నట్టు టాటా స్టీల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. (image: Tata Steel)
3. ఫైబర్-రీన్ఫోర్స్డ్ పాలిమర్ కాంపోజిట్ డిజైన్‌తో తయారు చేసిన సీట్లు ఇప్పటికే బెంగళూరు-మైసూర్ రూట్లో నడుస్తున్న వందే భారత్ రైలులో ఉన్నాయి. టాటా స్టీల్ ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ కోసం L1గా బిడ్ దాఖలు చేసింది. మొత్తం ఆర్డర్ విలువ రూ. 225 కోట్లు. ఈ మొత్తం ఆర్డర్‌ను 2023లో సరఫరా చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రస్తుతం భారతీయ రైల్వే 10 రూట్లలో వందే భారత్ రైళ్లను నడుపుతోంది. అందులో సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్ కూడా ఉంది. ఏప్రిల్‌లో మరిన్ని వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, రాంచీ-పాట్నా, భోపాల్-న్యూఢిల్లీ, అజ్మేర్-న్యూఢిల్లీ రూట్లలో ఏప్రిల్‌లో వందే భారత్ రైళ్లు ప్రారంభమ్యేయ అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)