1. దక్షిణ భారతదేశ యాత్రకు (South India Tour) వెళ్లాలనుకునే విశాఖపట్నం వాసులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) విశాఖపట్నం నుంచి సౌత్ ఇండియా టూర్ ప్యాకేజీ ప్రకటించింది. సదరన్ డివైన్ టెంపుల్ టూర్ పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో మదురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండ్రం లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆగస్ట్ 12న టూర్ ప్రారంభం కానుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. పర్యాటకుల్ని ఫ్లైట్‌లో తీసుకెళ్లి దక్షిణ భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను చూపించనుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. మరి ఈ టూర్ ఎలా సాగుతుందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. సాయంత్రం మదురైలో మీనాక్షి దేవి ఆలయ సందర్శన ఉంటుంది. సమీపంలోని ఇతర ఆలయాలు చూడొచ్చు. రాత్రికి మదురైలో బస చేయాలి. రెండో రోజు ఉదయం రామేశ్వరం బయల్దేరాలి. ఆ తర్వాత ధనుష్కోడి సందర్శించవచ్చు. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి. మూడో రోజు రామేశ్వరం సైట్ సీయింగ్ ఉంటుంది. ఆ తర్వాత కన్యాకుమారి బయల్దేరాలి. రాత్రికి కన్యాకుమారిలో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐఆర్సీటీసీ టూరిజం సదరన్ డివైన్ టెంపుల్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.32,350, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.33,770, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.43,330 చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, ఏసీ హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. లంచ్, ఫ్లైట్‌లో మీల్స్, ఫ్లైట్ టికెట్ల ధరలో మార్పులు కవర్ కావు. (ప్రతీకాత్మక చిత్రం)