1. తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త. పంచదేవాలయం టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలు కవర్ అవుతాయి. భక్తులు తిరుపతి చేరుకున్న తర్వాత ప్యాకేజీ మొదలవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. Day 1: మొదటి రోజు ఉదయం తిరుపతిలో టూర్ మొదలవుతుంది. ఉదయం 8 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్లో భక్తులను ఐఆర్సీటీసీ సిబ్బంది రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత హోటల్లో చెక్ ఇన్ కావాలి. ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాల సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుపతిలోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. Day 2: మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు తిరుమలకు తీసుకెళ్తారు. అక్కడ ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. భక్తులు తిరుమల దర్శనం కోసం ఒరిజినల్ ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. మధ్యాహ్నం 1 గంటలోగా దర్శనం పూర్తవుతుంది. 2 గంటల వరకు షాపింగ్ చేయొచ్చు. ఆ తర్వాత తిరిగి తిరుపతి చేరుకోవాలి. ఆ తర్వాత శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం సందర్శించొచ్చు. ఆ తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్లో భక్తులను డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)