1. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గడంతో శ్రీవారి భక్తులు తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC పంచదేవాలయం టూర్ ప్యాకేజీ అందిస్తోంది. గతంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ టూర్ ప్యాకేజీని నిలిపివేసింది ఐఆర్సీటీసీ టూరిజం. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పుడు కోవిడ్ 19 ప్రభావం తగ్గడంతో ఈ ప్యాకేజీని మళ్లీ అందిస్తోంది. ఐఆర్సీటీసీ పంచదేవాలయం టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న భక్తులు తిరుమల, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలు సందర్శించొచ్చు. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనం కూడా కవర్ అవుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ టూర్ ప్యాకేజీలో ఒక రోజు వసతి, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో దర్శనం, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. భక్తులు తిరుపతికి చేరుకున్న తర్వాత ఈ టూర్ ప్యాకేజీ మొదలవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)