1. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు సమీపంలో ఉన్న ఆలయాలను కూడా సందర్శిస్తుంటారు. తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత కాణిపాకం, శ్రీకాళహస్తి వెళ్లేవారు ఉంటారు. ఇంకా సమయం ఉంటే తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం ఆలయాలను కూడా సందర్శిస్తుంటారు. రెండుమూడు రోజులు తిరుపతి టూర్ (Tirupati Tour) ప్లాన్ చేసుకునేవారు తప్పనిసరిగా చుట్టుపక్కన ఉన్న ఆలయాలను కూడా సందర్శించడం మామూలే. (ప్రతీకాత్మక చిత్రం)
2. మరి మీరు కూడా తిరుపతికి రెండు రోజుల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీ మీకోసమే. పంచ దేవాలయం పేరుతో ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం (Tirumala Special Entry Darshan) ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. శ్రీవారి దర్శనంతో పాటు దీంతో పాటు తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాలు కూడా ఈ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఐఆర్సీటీసీ పంచ దేవాలయం 1 రోజు, 2 రాత్రుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ ప్యాకేజీ తిరుపతి నుంచి ప్రారంభం అవుతుంది. అంటే దూరప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకునే భక్తుల కోసం రూపొందించిన ప్యాకేజీ. (ప్రతీకాత్మక చిత్రం)
4. తిరుపతికి చేరుకున్న తర్వాత ఐఆర్సీటీసీ పంచదేవాలయం టూర్ మొదలవుతుంది. ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో పెట్టుకొని ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవాలి. ఐఆర్సీటీసీ పంచ దేవాలయం టూర్లో భాగంగా ఐఆర్సీటీసీ సిబ్బంది మొదటి రోజు ఉదయం 7 గంటలకు భక్తులను తిరుపతి రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. హోటల్లో ఫ్రెషప్ అయిన తర్వాత శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఆలయాల సందర్శన ఉంటుంది.ఆ తర్వాత శ్రీకాళహస్తి తీసుకెళ్తారు. రాత్రికి భక్తులు తిరుపతిలోనే బస చేయాలి. ఇక రెండో రోజు ఉదయం 8.00 గంటలకు తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంటుంది. తిరుమలలో దర్శనం పూర్తైన తర్వాత తిరుచూనూర్ పద్మావతి ఆలయ సందర్శన ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆ తర్వాత భక్తుల్ని తిరుపతి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయడంతో టూర్ ముగుస్తుంది. ఐఆర్సీటీసీ పంచ దేవాలయం టూర్ ప్యాకేజీ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. గ్రూప్ టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. టూర్ ప్యాకేజీలో తిరుపతిలో వసతి, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో స్పెషల్ ఎంట్రీ దర్శనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐఆర్సీటీసీ పంచ దేవాలయం ప్యాకేజీ ధరలు చూస్తే ముగ్గురి లోపు బుక్ చేస్తే ఒకరికి సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.11,070, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.6,580, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5,170. నలుగురి నుంచి ఆరుగురు బుక్ చేస్తే ఒకరికి డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5170, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.4940. ఏడుగురి నుంచి పది మంది కలిపి బుక్ చేస్తే ఒకరికి డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.4580, ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.4350. (ప్రతీకాత్మక చిత్రం)