కేంద్ర ప్రభుత్వానికి చెందిన పొదుపు పథకాల్లో (Savings Schemes) డబ్బులు దాచుకున్నవారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వం రాబోయే మూడు నెలలకు సంబంధించిన వడ్డీ రేట్లను (Interest Rates) భారీగా పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికానికి అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచడం ఇది మూడోసారి. వరుసగా మూడు త్రైమాసికాల్లో వడ్డీ రేట్లు పెరిగాయి. టర్మ్ డిపాజిట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి యోజన పథకాలకు వడ్డీ రేట్లు పెరిగాయి. ఏ పథకానికి వడ్డీ ఎంత పెరిగిందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
సేవింగ్స్ డిపాజిట్‌కు వడ్డీలో ఎలాంటి మార్పు లేదు. వార్షిక వడ్డీ 4 శాతం కొనసాగుతుంది. 1 ఏడాది టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 6.6 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. 2 ఏళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 6.7 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
3 ఏళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 6.9 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. 5 ఏళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 7 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగింది. 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటు 40 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 5.8 శాతం నుంచి 6.2 శాతానికి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 8 శాతం నుంచి 8.2 శాతానికి వడ్డీ పెరిగింది. మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్ వడ్డీ రేటు 30 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 7.1 శాతం నుంచి 7.4 శాతానికి వడ్డీ పెరిగింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 70 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 7 శాతం నుంచి 7.7 శాతానికి వడ్డీ పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. 7.1 శాతం వడ్డీ కొనసాగుతుంది. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ వడ్డీ రేటు 30 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 7.2 శాతం నుంచి 7.5 శాతానికి వడ్డీ పెరిగింది. స్కీమ్ మెచ్యూరిటీ 120 నెలల నుంచి 115 నెలలకు తగ్గింది. సుకన్య సమృద్ది యోజన స్కీమ్ వడ్డీ రేటు 40 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 7.6 శాతం నుంచి 8 శాతానికి వడ్డీ పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)