1. షిరిడీ వెళ్లాలనుకునే సాయి భక్తులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి షిరిడీ (Hyderabad to Shirdi) టూర్ ప్యాకేజీ ప్రకటించింది. సాయి శివం పేరుతో ఆపరేట్ చేస్తున్న షిరిడీ టూర్ ప్యాకేజీలో (Shirdi Tour Package) షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు నాసిక్ కవర్ అవుతుంది. ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఆర్సీటీసీ షిరిడీ టూర్ ప్యాకేజీ మొదటిరోజు హైదరాబాద్లో ప్రారంభం అవుతుంది. పర్యాటకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సాయంత్రం 6.50 గంటలకు అజంతా ఎక్స్ప్రెస్ ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 7.10 గంటలకు నాగర్సోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ్నుంచి షిరిడీకి బయల్దేరాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఐఆర్సీటీసీ షిరిడీ టూర్ ప్యాకేజీ స్టాండర్డ్ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,200, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4,940 చెల్లించాలి. కంఫర్ట్ ప్యాకేజీ ధర చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5,890, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,630 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీలో స్టాండర్డ్ ప్యాకేజీకి స్లీపర్ క్లాస్, కంఫర్ట్ ప్యాకేజీకి థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. తిరుపతి, వారణాసి, కేరళ, ఊటీ, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాలకు వేర్వేరు టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ టూర్ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)