1. వ్యాపారాలు నిర్వహించేందుకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారితో పాటు, మహిళలకు రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్టాండ్‌అప్ ఇండియా (StandUp India) పథకానికి ఇటీవల ఆరేళ్లు పూర్తైంది. 2016లో ఈ స్కీమ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి 21 వరకు 1,33,995 మంది ఈ రుణాలు తీసుకున్నారని, మొత్తం రూ.30,160 కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. స్టాండ్‌అప్ ఇండియా స్కీమ్ 2016 ఏప్రిల్ 5న ప్రారంభమైంది. ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి అట్టడుగు స్థాయిలో ఆంట్రప్రెన్యూర్షిప్ ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు, మహిళలకు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు రుణాలు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ రుణాలకు దరఖాస్తు చేయొచ్చు. లేదా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) స్టాండప్ ఇండియా పోర్టల్ https://www.standupmitra.in/ ద్వారా అప్లై చేయొచ్చు. లేదా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌కు లోన్ దరఖాస్తు పంపొచ్చు. ఆన్లైన్లో లోన్‌కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ముందుగా https://www.standupmitra.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Apply Here పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. New Entrepreneur, Existing Entrepreneur, Self Employed Professional ఆప్షన్స్‌లో మీకు సూటయ్యే ఆప్షన్ ఎంచుకోవాలి. పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ జనరేట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేయాలి. వ్యాపారం వివరాలు, లోన్ వివరాలు ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి రుణానికి దరఖాస్తు చేయాలి. సదరు బ్యాంకు లోన్ అప్లికేషన్ పరిశీలిస్తుంది. స్టాండ్‌అప్ ఇండియా పథకంలోని అర్హతలు ఉన్నట్టైతే వారికి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)