1. భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికులకు మరిన్ని సేవల్ని ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది భారతీయ రైల్వే (Indian Railways). అన్రిజర్వ్డ్ టికెట్లు, ప్లాట్ఫామ్ టికెట్లు (Platform Tickets) కొనుగోలు చేసేందుకు ఉపయోగించే స్మార్ట్ కార్డుల్ని ఆన్లైన్లో రీఛార్జ్ చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. ఇందుకోసం యూజర్లు UTSonmobile వెబ్ పోర్టల్లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆ తర్వాత స్మార్ట్ కార్డుల్ని (Smart Cards) ఆన్లైన్లోనే రీఛార్జ్ చేయొచ్చు. భారతీయ రైల్వే డిజిటలైజేషన్లో భాగంగా అన్రిజర్వ్డ్ టికెట్లు ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల (Autometic Ticket Vending Machines) ద్వారా కొనే సదుపాయాన్ని ప్రారంభించింది. ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్ల దగ్గర క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా టికెట్లు తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇప్పుడు రైల్వే కౌంటర్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. యూపీఐ, డెబిట్ కార్డుల్ని ఉపయోగించి ఆన్లైన్లోనే స్మార్ట్ కార్డుల్ని రీఛార్జ్ చేయొచ్చు. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్ల దగ్గర రద్దీని తగ్గించడానికి రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)