1. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) బ్యాంకులతో కలిసి ప్రత్యేకంగా క్రెడిట్ కార్డుల్ని (Credit Cards) రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (SBI) కలిసి ఐఆర్సీటీసీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ (IRCTC SBI Credit Card) అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాతో (Bank of Baroda) కలిసి రూపే ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త క్రెడిట్ కార్డును లాంఛ్ చేసింది ఐఆర్సీటీసీ. ఎక్కువగా రైలు ప్రయాణాలు చేసేవారి కోసం రూపొందించిన క్రెడిట్ కార్డ్ ఇది. ఇందులో కాంప్లిమెంటరీ సర్వీసెస్, రివార్డ్స్, బెనిఫిట్స్ ఉంటాయి. ఐఆర్సీటీసీ తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిసి రూపొందించిన ఐఆర్సీటీసీ బీఓబీ క్రెడిట్ కార్డ్ (IRCTC BoB Credit Card) బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఐఆర్సీటీసీ బీఓబీ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మొదటి ఏడాదికి రూ.500 చెల్లించాలి. ఆ తర్వాత యాన్యువల్ ఫీజు రూ.350 చెల్లించాలి. యాడ్ ఆన్ కార్డు తీసుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఉద్యోగులు, స్వయంగా ఉపాధి పొందుతున్నవారు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఉద్యోగులకు వార్షికాదాయం రూ.3,60,000 కన్నా ఎక్కువ, స్వయంగా ఉపాధి పొందుతున్నవారి వార్షికాదాయం రూ.4,80,000 కన్నా ఎక్కువ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసేవారి వయస్సు 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. యాడ్ ఆన్ కార్డ్ హోల్డర్ వయస్సు 18 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండాలి. ఐఆర్సీటీసీ బీఓబీ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి పాన్ కార్డ్, మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, అడ్రస్ ప్రూఫ్, ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఐఆర్సీటీసీ బీఓబీ క్రెడిట్ కార్డ్ తీసుకున్న మొదటి 45 రోజుల్లో రూ.1,000 కన్నా ఎక్కువ సింగిల్ ట్రాన్సాక్షన్ చేస్తే 1000 బోనస్ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఈ కార్డుకు ఫ్యూయెల్ సర్‌ఛార్జీ మాఫీ ఉంటుంది. రూ.500 నుంచి రూ.3,000 మధ్య అన్ని ఫ్యూయెల్ ట్రాన్సాక్షన్స్‌కు ఒక శాతం ఫ్యూయెల్ సర్‌ఛార్జీ మాఫీ లభిస్తుంది. ఒక స్టేట్మెంట్కు గరిష్టంగా రూ.100 మాఫీ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ క్రెడిట్ కార్డుతో రూ.100 చెల్లింపులు చేస్తే రెండు రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్‌లో రైలు టికెట్లకు కూడా ఈ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఒక రివార్డ్ పాయింట్ 25 పైసలతో సమానం. రివార్డ్ పాయింట్స్‌తో రైలు టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, చెయిర్ కార్ లాంటి బుకింగ్స్ కోసం రివార్డ్ పాయింట్స్ రీడీమ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ క్రెడిట్ కార్డుతో రూ.2,500 కన్నా ఎక్కువ చెల్లింపుల్ని స్మార్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో ఈఎంఐగా మార్చుకోవచ్చు. 6 నెలల నుంచి 36 నెలల ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఐఆర్సీటీసీ బీఓబీ క్రెడిట్ కార్డ్ ప్రైమరీ కార్డ్ హోల్డర్ తమ జీవిత భాగస్వామి, పిల్లలు, సోదరులు, తల్లిదండ్రుల పేర్ల మీద ఉచితంగా మూడు లైఫ్ టైమ్ ఫ్రీ యాడ్ ఆన్ కార్డు తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)